Yamadonga Re Release Collections: రీ రిలీజ్ ట్రెండ్ ని మన టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పోకిరి చిత్రం తో మొదలైన ఈ ట్రెండ్, ఆ తర్వాత జల్సా తో తారాస్థాయికి చేరింది. ఇక అక్కడి నుండి ఈ ట్రెండ్ మొన్న విడుదలైన ‘జగదేక వీరుడు అతిలోకసుందరి’ సుందరి వరకు ఎక్కువ శాతం సక్సెస్ సాధించినవే ఉన్నాయి. కానీ మొదటిసారి గ్రాండ్ గా ప్లాన్ చేసిన రీ రిలీజ్ సినిమాకు డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమానే యమదొంగ(Yamadonga Movie)). వరుస ఫ్లాప్స్ లో ఉన్న ఎన్టీఆర్(Junior NTR) కెరీర్ ని మలుపు తిప్పి ఆయన సరికొత్త ఊపిరి అందించిన సినిమా ఇది. నందమూరి అభిమానులకు అయితే ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. అలాంటి సినిమా రీ రిలీజ్ అవుతుంది అంటే కచ్చితంగా భారీ వసూళ్లు వస్తాయని అనుకున్నారు అందరూ.
Also Read: రీషూట్ కి సిద్దమైన విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’..ఆ సన్నివేశాలపై హీరో అసంతృప్తి?
అందుకు తగ్గట్టుగా అన్ని ప్రాంతాలకు టాప్ మోస్ట్ బయ్యర్స్ ని పట్టుకొని ఈ సినిమాని గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కానీ బయ్యర్స్ కి పాపం కనీసం ప్రింట్ ఖర్చులను కూడా రాబట్టలేకపోయింది ఈ సినిమా. నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం పది వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. కనీసం టాప్ 10 లో కూడా చోటు దక్కించుకోలేదు. ఇక ఎన్టీఆర్ కి కంచుకోట గా పిలవబడే సీడెడ్ లో కూడా ఈ సినిమాకు దయనీయమైన వసూళ్లు వచ్చాయి. అనంతపురం ఎన్టీఆర్ అడ్డా అని అందరు అంటుంటారు. అనంతపురం జిల్లా మొత్తానికి లక్షా 75 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. మొదటి రోజు అనంతపురం సిటీ నుండే 78 వేల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది ఎన్టీఆర్ కి ఘోరమైన అవమానం అని చెప్పొచ్చు. అనంతపురం జిల్లాలోని హిందూపురం లో కనీసం పది వేల రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది.
ఈ సినిమా వసూళ్లను చూసి రీ రిలీజ్ ట్రెండ్ కి క్రేజ్ పోయిందా అని చాలా మంది అంటున్నారు. కానీ వాళ్లకు అర్థం కావల్సినది ఏమిటంటే రీసెంట్ గా విడుదలైన ‘సలార్’, ‘ఆరెంజ్’,’ఆర్య 2′, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రాలు మంచి సక్సెస్ అయ్యాయి. ఎన్టీఆర్ అభిమానులు యమదొంగ చిత్రాన్ని పట్టించుకోకుండా అయినా ఉండాలి, లేకపోతే ఆ సినిమాకు అసలు క్రేజ్ లేదని అనుకోవాలి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చినట్టు తెలుస్తుంది. పుట్టినరోజు నాడు గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న ఒక సినిమాకు ఈ రేంజ్ డిజాస్టర్ రెస్పాన్స్ రావడం దురదృష్టకరం. యమదొంగ కి బదులుగా అదుర్స్ చిత్రాన్ని రీ రిలీజ్ చేసుంటే సక్సెస్ అయ్యేదని అంటున్నారు నెటిజెన్స్.