Bharani Movie Heroine: సౌత్ సినిమా ఇండస్ట్రీలో కేవలం ఒకటి రెండు సినిమాలతో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు ఇప్పటివరకు చాలామంది ఉన్నారు. ప్రారంభంలో సూపర్ హిట్స్ అందుకొని ఆ తర్వాత మాత్రం వరుసగా ఫ్లాపులు పడడంతో సినిమా ఇండస్ట్రీలో సైలెంట్ గా ఉండిపోతున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే బ్యూటీ కూడా కెరియర్ ప్రారంభంలో సూపర్ హిట్స్ అందుకుంది. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు బాగా ఫాలోయింగ్ ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఆమె సినిమా ఇండస్ట్రీలో సైలెంట్ గా ఉండిపోయింది. కేవలం ఒక సినిమాతోనే బాగా ఫేమస్ అయినా హీరోయిన్లు చాలామంది ఉన్నారు. మనం చెప్పుకోబోయే భరణి సినిమా హీరోయిన్ కూడా భరణి సినిమాతో బాగా గుర్తింప తెచ్చుకుంది. తన అందంతో, అభినయంతో మాయ చేసి ప్రేక్షకులను కట్టుబడింది. తక్కువ సమయంలోనే తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈమె ఒకప్పుడు తోపు హీరోయిన్. విశాల్ కు జోడిగా ఈ బ్యూటీ భరణి సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తమిళ్లో రూపొందిన ధరణి సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయడం జరిగింది. ఇక భరణి సినిమా తమిళ్తో పాటు తెలుగులో కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమా లవర్స్ ను ఈ బ్యూటీ ఆకట్టుకుంది.
Also Read: ‘యమదొంగ’ రీ రిలీజ్ మొదటి రోజు వసూళ్లు..ఇంతటి డిజాస్టర్ రెస్పాన్స్ ఊహించలేదు!
ఈ సినిమాలో చాలా సంప్రదాయ పద్ధతిలో బబ్లీగా ఉన్న ఈ చిన్నది తన చిరునవ్వుతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. భరణి సినిమా హీరోయిన్ పేరు ముక్త. ఈమె తమిళ్లో అలాగే మలయాళం లో కూడా పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కెరియర్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీని తెచ్చుకుంది. భరణి సినిమా సమయంలో ముక్త ముఖ్యంగా కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది. తన అందంతో, క్యూట్ నెస్ తో ఈ చిన్నది అందరిని ఆకట్టుకుంది. ఒట్ట ననయం అని సినిమాతో ముక్త హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే ముక్త బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముక్తా చేసిన ఒక సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ తమిళ్ అలాగే మలయాళం సినిమా ఇండస్ట్రీలో మాత్రం ముక్త మంచి అవకాశాలు అందుకుంది. కెరియర్ బాగా ఫామ్ లో ఉండగానే ప్రముఖ సింగర్ రీమిటోని సోదరుడు రింకు టోనీ ముక్త 2015 లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని ఏళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ముక్త ప్రస్తుతం మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ముక్త నిత్యం తనకు సంబంధించిన ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
View this post on Instagram