Kingdom: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మార్కెట్ బాగా డౌన్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ‘గీత గోవిందం’ తర్వాత ఈ క్రేజీ హీరో కెరీర్ లో ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. ‘టాక్సీవాలా’ చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది కానీ, ఆ చిత్రం విజయ్ దేవరకొండ స్టేటస్ ని పెంచడానికి ఏ మాత్రం కూడా ఉపయోగపడలేదు. అయినప్పటికీ కూడా యూత్ ఆడియన్స్ లో ఆయనకు క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ముఖ్యంగా అమ్మాయిలలో ఈయనకు ఉన్నంత ఫాలోయింగ్ నేటి తరం స్టార్ హీరోలకు కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం ఒకే ఒక్క హిట్ చాలు. స్టార్ హీరోల లీగ్ లోకి కాదు, ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెడతాడు విజయ్ దేవరకొండ.
Also Read: ‘పెద్ది’ షూటింగ్ లొకేషన్ లో మట్టి తుఫాను..సంచలనంగా మారిన వీడియో!
అలా తనని మరో లెవెల్ కి తీసుకెళ్లే సినిమాగా ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం నిలుస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ నుండి చాలా వరకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ బ్యాలన్స్ ఉండడం తో ఈ నెల 30న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాను జులై నాల్గవ తేదికి వాయిదా వేశారు. అయితే నెల రోజుల పాటు సమయం దొరకడం తో విజయ్ దేవరకొండ కి ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తే బాగుంటుంది అని అనిపించిందట. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ కి రీ షూట్ అవసరం అని ఆయన చెప్పడం తో గౌతమ్ కూడా నిజమే అని అర్థం చేసుకొని కొన్ని కీలక సన్నివేశాలను మరో రెండు రోజుల తర్వాత రీ షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ చిత్రం ఔట్పుట్ విషయం లో విజయ్ దేవరకొండ దగ్గర నుండి డైరెక్టర్ వరకు ఎవ్వరూ కూడా తగ్గడం లేదు. కనీవినీ ఎరుగని రేంజ్ బ్లాక్ బస్టర్ పై మూవీ టీం కన్నేసింది. ఈసారి కొడితే వంద కోట్ల గ్రాస్ రావడం కాదు, ఈ సినిమాతో ఏకంగా రెండు వందల కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరాలని విజయ్ దేవరకొండ ఎంతో కసితో పని చేసిన చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. అదే విధంగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో హీరోయిన్ గా భాగ్యశ్రీ భొర్సే నటించింది. ఆమె సన్నివేశాలు కూడా చాలా బాగా వచ్చాయని మొదటి పాటని చూసినప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. చూడాలి మరి విజయ్ దేవరకొండ కలలను ఈ సినిమా నిజం చేస్తుందా లేదా అనేది.