https://oktelugu.com/

Kalki Movie: కల్కిలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ కంటే ఆ స్టార్ హీరో అయితే బాగుండేదా..?

Kalki Movie: మొత్తానికైతే ఈ సినిమా మీద ఇండస్ట్రీ లో ఉన్న సినిమా పెద్దలందరూ కూడా స్పందిస్తూ సినిమా అద్భుతంగా ఉందని చెప్పడంతో మరొక రకంగా ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్ లో జరుగుతున్నాయనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : June 29, 2024 / 12:19 PM IST

    Vijay Deverakonda as Arjun in Kalki

    Follow us on

    Kalki Movie: రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి సినిమా మంచి విజయం సాధించి ముందుకు దూసుకెళ్తుంది. ఇక మొదటి నుంచి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండటంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ రూపంలో భారీ కలెక్షన్స్ రావడానికి సహకరించింది.

    ఇక మొత్తానికైతే ఈ సినిమా మీద ఇండస్ట్రీ లో ఉన్న సినిమా పెద్దలందరూ కూడా స్పందిస్తూ సినిమా అద్భుతంగా ఉందని చెప్పడంతో మరొక రకంగా ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్ లో జరుగుతున్నాయనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో అర్జునుడి క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ నటించాడు. అయితే ఈయన మీద గత రెండు రోజుల నుంచి భారీ విమర్శలైతే వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే కొందరైతే ఈ క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ కాకుండా ఆ క్యారెక్టర్ ని ఒక ఐదు నిమిషాల పాటు పెంచి అందులో రామ్ చరణ్ ని పెడితే అద్భుతంగా ఉండేది అంటూ మెగా అభిమానులతో పాటు మరి కొందరు ప్రేక్షకులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    రామ్ చరణ్ కనక ఈ సినిమాలో ఉంటే ఈ సినిమాకి అదనపు బలం తోడయ్యేది. అప్పుడు సినిమా కలెక్షన్స్ అద్భుతమైన రేంజ్ లో ఉండేవని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే స్టార్ కాస్టింగ్ తో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోవడంతో అలాంటి ప్రయత్నం చేయలేనట్టుగా తెలుస్తుంది. ఇకమీదట కూడా తను భారీ సినిమాలు చేసి మంచి విజయాలు అందుకోవాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇండియాలో రాజమౌళి మాత్రమే భారీ గ్రాఫిక్స్ ను వాడతాడనే పేరు తెచ్చుకున్నాడు.

    కానీ ఆయన తర్వాత నాగ్ అశ్విన్ కూడా అద్భుతమైన రీతిలో గ్రాఫిక్స్ ను వాడి వండర్స్ ను క్రియేట్ చేయడం లో తను కూడా చాలా ముందు వరుస లో ఉన్నాడు అనేది మరొకసారి ప్రూవ్ చేశాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన అటు భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా విమర్శకుల నుంచి భారీ ప్రశంసలను కూడా అందుకుంటున్నాడు…