Nag Ashwin: ఒక అద్భుతమైన కలను కంటాం.. అందులో గొప్పగా ఊహించుకుంటాం.. నిజజీవితంలో లేనివి కూడా అందులో కనిపిస్తాయి.. కానీ ఆ కలకు రూపమిస్తే ‘కల్కి’లా మనముందు నిలుస్తుంది.. దానికి ఏ రాజమౌళినో, జేమ్స్ కామెరూన్ నో కావాల్సిన పనిలేదు.. మన సామాన్య దర్శకుడు నాగ్ అశ్విన్ సైతం చాలు.. ఊహలకు రెక్కలొస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ.. కల్కి లాంటి అద్భుత ప్రపంచాన్ని పరిచయం చేశాడు..
ఇక నిన్న రిలీజ్ అయిన కల్కి సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. అయితే ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడడానికి అమితమైన ఇష్టాన్ని చూపిస్తున్నారు. ఇక ఈ వీకెండ్ మొత్తం కల్కి సినిమాకి భారీ కలెక్షన్లు అయితే రాబోతున్నాయనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల దాకా ప్రతి ఒక్కరు ఈ సినిమాని థియేటర్లో చూడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.
ఈ సినిమా భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా తెరకెక్కింది. కాబట్టి సినిమాను చూసిన అనుభూతి పొందాలంటే దీనిని థియేటర్ లోనే చూడాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని నాగ్ అశ్విన్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఆయన మైండ్ లో ఏదైతే అనుకున్నాడో దాని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక అందులో ఆయన సక్సెస్ కూడా అయ్యాడు.
ఇక ఇప్పటి దాకా భారీ గ్రాఫిక్స్ ఉన్న సినిమాలు తీయాలి అంటే అది జేమ్స్ కామెరూన్, రాజమౌళి లాంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప సగటు దర్శకులు అలాంటి సినిమాలు చేయలేరు అంటూ చాలా కామెంట్లైతే చేసేవారు. కానీ నాగ్ అశ్విన్ లాంటి ఒక యంగ్ డైరెక్టర్ భారీ గ్రాఫికల్ సినిమాగా ‘కల్కి ‘ సినిమాను తెరకెక్కించి సామాన్యు దర్శకుడు కూడా ఒక కల కంటే ఆ కలని నిజం చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యం తో నాగీ తన మైండ్ కి పదును పెట్టి సినిమాని తెరకెక్కించి సూపర్ సక్సెస్ అయ్యాడు.
అందుకే సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఏ దర్శకుడు ఎలాంటి వండర్స్ ను క్రియేట్ చేస్తాడు అనేది ఎవరు చెప్పలేరు. ఇక నాగ్ అశ్విన్ ఇచ్చిన ఈ సక్సెస్ తో చాలామంది యంగ్ డైరెక్టర్స్ సైతం గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపించే అవకాశాలైతే ఉన్నాయి…ఇక కల్కి సినిమా లాంగ్ రన్ లో బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేస్తుందేమో చూడాలి…