Star Hero: ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునే అవకాశం ఉన్న స్టార్ హీరో ఎవరంటే..?

Star Hero: ఎప్పటి నుంచో తుప్పు పట్టిపోయిన రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా తెలుగోడి స్టామినాని బాలీవుడ్ హీరోలకు తెలిసేలా చేస్తున్నాడు. 'పడగొట్టేవాడు లేనంతవరకే తొడగొట్టేవాడు రాజ్యమేలుతూ ఉంటాడు'.

Written By: Gopi, Updated On : June 29, 2024 12:23 pm

Who is the star hero who has a chance to get the number one position in India

Follow us on

Star Hero: సరైన పోటుగాడు తగలనంతవరకు వేటగాడే అడవిని ఎలుతూ ఉంటాడు. కానీ ‘ఒక్కసారి దమ్మున్నోడు ఎదురుపడితే దునియా మొత్తం దాసోహం అవ్వాల్సిందే’… ఇక ప్రస్తుతం ప్రభాస్ సినిమాలను చూస్తుంటే అందరికీ ఈ మాటలు గుర్తుకొస్తున్నాయి. బాహుబలి సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమా దాకా ప్రతి ఒక్క సినిమాతో పాన్ ఇండియా ఇండస్ట్రీలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఆకలి మీదున్న సింహం బయటకొస్తే వేట ఎలా ఉంటుందో ప్రభాస్ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతున్న తీరు కూడా అలానే ఉంది.

ఎప్పటి నుంచో తుప్పు పట్టిపోయిన రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా తెలుగోడి స్టామినాని బాలీవుడ్ హీరోలకు తెలిసేలా చేస్తున్నాడు. ‘పడగొట్టేవాడు లేనంతవరకే తొడగొట్టేవాడు రాజ్యమేలుతూ ఉంటాడు’. ఇక ఈ మాటలు బాలీవుడ్ హీరోలకి సరిగ్గా సరిపోతాయి. మొన్నటిదాకా తెలుగు సినిమాని తక్కువ చేసి చూసిన వాళ్లకి ప్రభాస్ రూపంలో ఒక భారీ మొనగాడు తగిలాడనే చెప్పాలి. ప్రభాస్ ప్రభంజనాన్ని ఆపడం వాళ్ళ వల్ల కాదు. ఇక ఇండియా మొత్తానికి ప్రభాస్ ఒక్కడే నెంబర్ వన్ స్టార్ హీరో గా ఎదుగుతున్నాడు.

ఇక మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ ప్లేస్ ను రిప్లేస్ చేసే హీరో ఎవరు అంటూ చాలా సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది. ఇక ఇప్పుడు అందుకున్న సక్సెస్ లను బట్టి చూస్తే ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో వందల కోట్లను కలెక్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఒకప్పుడు చిరంజీవి కూడా ఇలాంటి రికార్డ్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టార్ హీరోల్లో కొందరు పాన్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయలేదు. వాళ్ళకి అక్కడ మార్కెట్ కూడా ఓపెన్ అవ్వలేదు. ఇక అలాంటి సమయంలోనే ప్రభాస్ ఇప్పటికే ఆరు సినిమాలతో వందల కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతూ ఇండస్ట్రీని తారా స్థాయికి తీసుకెళ్లడంలో చాలా వరకు కృషి చేస్తున్నాడు…