https://oktelugu.com/

Gautham : గౌతమ్ గోల్డెన్ బాక్స్ తీసుకొని ఉంటే బాగుండేదా..? మరి ఆయన ఆ బాక్స్ ను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి..?

బిగ్ బాస్ షో గురించి మనం ఎంత ఎక్కువగా చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : December 16, 2024 / 02:00 PM IST

    Gautham

    Follow us on

    Gautham : బిగ్ బాస్ షో గురించి మనం ఎంత ఎక్కువగా చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఎనిమిది సీజన్ల నుంచి ఈ షో టాప్ రేటింగ్ తో దూసుకెళ్ళడమే కాకుండా చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతుంది…ఇక ఈ షో ద్వారా చాలామంది టాప్ సెలబ్రిటీలుగా కూడా మారిపోయారు…

    టెలివిజన్ రేంజ్ లోనే అత్యంత పెద్ద షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి…ఇక 105 రోజులపాటు సాగిన ‘బిగ్ బాస్ సీజన్ 8’ ఎట్టకేలకు సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఇక నిఖిల్ సీజన్ 8 టైటిల్ విన్నర్ గా నిలవడమే కాకుండా ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’ చేతుల మీదుగా ట్రోఫీ ని అందుకోవడం అనేది అతనికి మెమొరబుల్ మూమెంట్ గా మారిపోయిందని నిఖిల్ చెప్పడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఈ షో ప్రేక్షకులకి ఒక మంచి అనుభూతిని అందించిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఫైనల్ కి వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్స్ లో గౌతమ్ గెలుస్తాడని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. కానీ చివరి నిమిషంలో నిఖిల్ గెలవడంతో కొంతమంది మాత్రం నిరాశ పడ్డారనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా గేమ్ షో అన్నప్పుడు ఎవ్వరూ గెలిచినకూడ అందరూ దాన్ని స్పోర్టీవ్ గా తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రతి ఒక్కరు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ల వల్ల కెరియర్లో ముందుకు దూసుకెళ్ళడానికి బిగ్ బాస్ షో అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగితే అందరికీ మంచిదని నాగార్జున కూడా తెలియజేయడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా చివరి నిమిషంలో నిఖిల్, గౌతమ్ ఇద్దరు ఉన్నప్పుడు నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి గోల్డెన్ బాక్స్ ను మీ ఇద్దరిలో ఎవరో ఒకరు తీసుకొని స్కిప్ అయిపోతే మంచిది అంటూ వాళ్లకు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు.

    కానీ నిఖిల్ గౌతమ్ ఇద్దరు కూడా ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు.అందులో ఎంత మనీ ఉందో తెలియకుండానే వాళ్ళిద్దరూ అందులో 55 లక్షలు ఉన్న కూడా మేము దానిని రిజెక్ట్ చేస్తామంటూ చెప్పారు. ఒక రకంగా వాళ్ళలో గెలవాలనే పట్టుదల, గెలుస్తామనే సంకల్పం అయితే ఉన్నాయి.

    కానీ గేమ్ లో ఎవరో ఒక్కరు మాత్రమే విజయం సాధిస్తారనే ఒక ఆలోచనను ఇద్దరు మర్చిపోయినట్టుగా వ్యవహరించారు. కానీ ఎవరికి వారు మేము విజేతలు అవుతామని అనుకోవడంలో తప్పైతే లేదు. ఇక టాప్ టూ కంటెస్టెంట్స్ అంటే ఇద్దరు విజయం సాధించినట్టే కానీ గోల్డెన్ బాక్సును కనుక ఒకవేళ గౌతమ్ తీసుకొని ఉండుంటే మాత్రం అతనికి దాదాపు 25 లక్షల వరకు డబ్బులు అయితే అందేవని ఆ గోల్డెన్ బాక్స్ లో 25 లక్షలు ఉన్నాయంటూ ఒక వార్త అయితే బయటకు వచ్చింది…

    గౌతమ్ అభిమానులు గోల్డెన్ బాక్స్ తీసుకొని స్కిప్ అయిపోయిన బాగుండేది అంటూ ఒకరకంగా ఆలోచిస్తున్నారు. కానీ గౌతమ్ మాత్రం డబ్బుల కోసం తను గేమ్ షో కి రాలేదని తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని అనడంతో ప్రతి ఒక్కరూ గౌతమ్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ సంతోషానికి గురవుతున్నారు…