https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్స్ లో నిజంగా ప్రేమించుకున్న జంటలు..కంటెంట్ కోసం లవ్ ట్రాక్స్ నడిపిన జంటలు ఇవే!

తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో అతి పెద్ద డిజాస్టర్ సీజన్ ఏదైనా ఉందా అంటే, అది ఈ సీజనే. ఈ సీజన్ లో ఏ ఒక్క బాండింగ్ లోనూ నిజాయితీ కనిపించేది కాదు. అందుకే ఆడియన్స్ కూడా కనెక్ట్ కాలేదు. ఇనాయ సుల్తానా, సూర్య మధ్య ప్రేమ చిగురిస్తున్నా సమయంలో సూర్య ఎలిమినేట్ అవ్వడంతో ఆ ట్రాక్ మధ్యలోనే ఆగిపోయింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 16, 2024 / 02:06 PM IST

    Bigg Boss 8 Telugu(3)

    Follow us on

    Bigg Boss 8 Telugu: గత బిగ్ బాస్ సీజన్ లో లవ్ ట్రాక్స్ నడవలేదు..గౌతమ్, శుభశ్రీ తో అలాగే పల్లవి ప్రశాంత్ రాతికతో లవ్ ట్రాక్స్ నడుపుదామని అనుకున్నారు కానీ, ఆ ట్రాక్స్ కేవలం రెండు వారాల్లోపే ముగిసిపోయాయి. ఈ సీజన్ లో అలాంటి ట్రాక్స్ చాలానే నడిచాయి. సీజన్ ఎండ్ వరకు కొనసాగాయి. ఆ లవ్ ట్రాక్స్ మొత్తం నిజంగానే అనిపించింది. కంటెంట్ కోసం ట్రాక్స్ నడుపుతున్నట్టు అనిపించలేదు. ముఖ్యంగా పృథ్వీ, విష్ణు ప్రియ లవ్ ట్రాక్ చాలా నిజాయితీగా అనిపించింది. ఇక్కడ రెండు వైపుల నుండి ప్రేమ లేదు, కేవలం విష్ణు ప్రియ మాత్రమే లవ్ చేసింది కానీ, అది కంటెంట్ కోసం చేసినట్టుగా అనిపించలేదు. అదే విధంగా యష్మీ , నిఖిల్ మధ్య ఉన్న లవ్ ట్రాక్ కూడా అలాంటిదే. కమ్యూనికేషన్ సమస్య వల్ల వీళ్ళ ట్రాక్ ముందుకు కదలలేకపోయింది. ఇదంతా పక్కన పెడితే గత సీజన్స్ లో నడిచిన లవ్ ట్రాక్స్ నిజమైనవా?, లేదా కంటెంట్ కోసం చేసారా అనేది ఇప్పుడు వివరం గా చూద్దాం.

    సీజన్ 6 లో ఇనాయ, సూర్య:

    తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో అతి పెద్ద డిజాస్టర్ సీజన్ ఏదైనా ఉందా అంటే, అది ఈ సీజనే. ఈ సీజన్ లో ఏ ఒక్క బాండింగ్ లోనూ నిజాయితీ కనిపించేది కాదు. అందుకే ఆడియన్స్ కూడా కనెక్ట్ కాలేదు. ఇనాయ సుల్తానా, సూర్య మధ్య ప్రేమ చిగురిస్తున్నా సమయంలో సూర్య ఎలిమినేట్ అవ్వడంతో ఆ ట్రాక్ మధ్యలోనే ఆగిపోయింది. బహుశా సూర్య హౌస్ లో కొనసాగి ఉండుంటే ఈ ట్రాక్ నడిచేదేమో.

    సీజన్ 5 లో మానస్, ప్రియాంక:

    వీళ్లిద్దరి గురించి మాట్లాడుకునే ముందు, మనం సిరి, షణ్ముఖ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్లిద్దరికీ బయట లవర్స్ ఉన్నారు, పెళ్ళికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ స్నేహం పేరుతో వీళ్లిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ చూస్తే, అసలు వీళ్ళు ప్రేమికులా?, లేదా స్నేహితులా? అనే సందేహం కలిగింది. లెక్కలేనన్ని కిస్సులు, హగ్గులు బిగ్ బాస్ హిస్టరీ లో వీళ్లిద్దరి మధ్య జరిగినంత ఎవరికీ జరగలేదు అనుకుంట. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లిన తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్టు ఉన్నారు. వీళ్ళ మధ్య జరిగిన తతంగాన్ని చూసి షణ్ముఖ్ ని దీప్తి సునైనా వదిలేసింది. ఇది కాసేపు పక్కన పెడితే మానస్, ప్రియాంక మధ్య లవ్ ట్రాక్ కూడా అప్పట్లో హైలైట్ అయ్యింది. కేవలం ప్రియాంక వైపు నుండే లవ్ ఉంది కానీ, మానస్ వైపు నుండి లేదు.

    సీజన్ 4 లో అఖిల్, మోనాల్:

    ఈ సీజన్ మొత్తం హైలైట్ అయ్యిందే లవ్ ట్రాక్స్ వల్ల. అఖిల్, మోనాల్, అభిజిత్ మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడిచింది. మోనాల్, అఖిల్ లవ్ ట్రాక్ నడిచింది. వీళ్లిద్దరు కలిసి అభిజిత్ ని టార్గెట్ చేశారు. ఈ సీజన్ మొత్తం ఈ క్లాష్ అప్పట్లో హైలైట్ అయ్యింది. అదే విధంగా ఇదే సీజన్ లో హారిక అభిజిత్ పై ప్రేమ చూపించింది, కానీ అతని నుండి ఎలాంటి పాజిటివ్ సిగ్నల్స్ రాలేదు.

    సీజన్ 3 లో పునర్నవి, రాహుల్:

    ఈ సీజన్ లో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఒక రేంజ్ లో నడిచింది. రాహుల్ పునర్నవి కోసం చెయ్యని త్యాగం లేదు. అయితే వీళ్ళ మధ్య నడిచిన ట్రాక్ కేవలం కంటెంట్ కోసమే అని ఆ తర్వాత అర్థమైంది. బయటకి వచ్చిన తర్వాత రాహుల్ సీజన్ 7 కంటెస్టెంట్ రతికా తో ప్రేమాయణం నడిపాడు. వీళ్ళిద్దరికి బ్రేకప్ కూడా అయిపోయింది.

    సీజన్ 2 లో సామ్రాట్, గీతా మాధురి:

    ప్రేక్షకులకు అత్యంత చిరాకు రప్పించిన లవ్ ట్రాక్ ఇది. ఎందుకంటే గీత మాధురి కి అప్పటికే నందు తో పెళ్లి అయిపోయింది. కానీ సామ్రాట్ తో ఈమె పులిహోర కలపడం, ఆయన కూడా పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వడం చూసే ఆడియన్స్ బీపీ పెంచేలా చేసింది. ఇదంతా కేవలం కంటెంట్ కోసమే వీళ్లిద్దరు చేసారు.