spot_img
Homeఎంటర్టైన్మెంట్ఒకేసారి నాలుగు ప్రాజెక్టులతో హీరో నిఖిల్​ బిజీ!

ఒకేసారి నాలుగు ప్రాజెక్టులతో హీరో నిఖిల్​ బిజీ!

చిన్న చిన్న పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమై.. ప్రస్తుతం టాప్​ యంగ్​ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు నిఖిల్​. తన సినిమాలకంటూ టాలీవుడ్​ ప్రేక్షకుల్లో స్పేషల్​ మార్క్​ను క్రియేట్​ చేసుకుని విభిన్న కథాంశాలతో దూసుకెళ్లిపోతున్నారు. స్వామి రారా తర్వాత నుంచి నిఖిల్​ సినిమా రిలీజ్​ అవుతుందంటే చాలు అందులో ఏదో కొత్తదనం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ వస్తున్నారు. ఆ అంచనాలను ఎక్కడా తగ్గకుండా ప్రతి సారీ సరికొత్త కథతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా, మరో అప్​డేట్​ ఇస్తూ.. అభిమానుల్లో ఒక్కసారిగా జోష్​ పెంచారు నిఖిల్​. తన కెరీర్​లో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి నాలుగు చిత్రాలకు పని చేస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్​ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు నిఖిల్​.

తన కెరీర్​లో ఎప్పుడూ చూడని అనుభవంగా వర్ణించారు. ఒకేసారి నాలుగు సినిమాలకు వర్క్ చేయడంతో తన నలుగురు పిల్లల్లో ఎవర్ని మొదటగా ఎంచుకోవాలో అన్నట్టుగా ఉందని చెప్పుకొచ్చారు. అన్ని సినిమాలకు తన బెస్ట్ ఫర్మార్మెన్స్​ అందిస్తున్నట్లు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే నిఖిల్​కు సినిమాలపై ఉన్న డెడికేషన్​ ఎంటో అర్థం చేసుకోవచ్చు.

స్వామిరారా సినిమాతో సూపర్​ హిట్​ కొట్టిన నిఖిల్​.. ఆ తర్వాత వచ్చిన కార్తికేయ చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు నిఖిల్. చేసే ప్రతి సినిమాలో విభిన్న కథను ఎంచుకుంటూ.. ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. చివరగా నిఖిల్​ నుంచి వచ్చిన సినిమా అర్జున్​ సురవరం. ఇందులో జర్నలిస్టుగా అదరగొట్టారు. మరి వచ్చే నాలుగు చిత్రాల్లో నిఖిల్​ ఎలా కనిపించనున్నాడో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper