
ఏపీలో వైఎస్ జగన్ సర్కారు ప్రవేశపెడతున్న సంక్షేమ పథకాలు ఇప్పుడు అతడికే తలనొప్పిగా మారుతున్నాయి. యువతకు ఉపాధి కల్పించాలనే సీఎం ఆలోచన అతడిపైనే తిరగబడేలా మారుతోంది. విషయం ఏంటంటే.. ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకంలో తొలిరెండు రోజులకే డ్రైవర్లు ఎదురు తిరిగారు. దీంతో దిగివచ్చిన సర్కారు వారికి రూ.5వేల జీతాన్ని పెంచేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి వరకు నెలకు రూ.16వేల ఇస్తామన్న ప్రభుత్వం నిర్ణయంలో ఒక్కరోజుకే డ్రైవర్లు వాహనాలు పక్కన పెట్టేశారు. దీంతో మరో ఐదువేలు ఇస్తాం..బండ్లు తీయండని ప్రభుత్వం సూచించింది. ఇప్పుడీ అంశం వారిని సంతృప్తి పరిచిందో లేదో కానీ.. మరికొందరికి కడుపు మండిపోయేలా చేస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేసేలా మారుతోంది.
Also Read: ఏపీలో ఇప్పుడిక బదిలీల ‘పంచాయతీ’
ఏపీ సర్కారు తీసుకొచ్చిన ఇంటింటికీ రేషన్ పథకం నిర్ణయంతో రేషన్ డీలర్ల వ్యవస్థకు గండం ఏర్పడింది. అయితే వారిని సంతృప్తి పరిచేలా.. స్టాకిస్టులుగా ఉంటే.. నెలకు రూ.7వేల ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. దీంతో చాలా మంది డీలర్లు అలాగే ఉండిపోయారు. ఉదయాన్నే రేషన్ పంపిణీ వాహన డ్రైవర్లకు బియ్యం, ఈ పాస్ మిషన్లు అందివ్వడం వారి పని. సాయంత్రం వారినుంచి మిగిలిన బియ్యం, ఈ పాస్ మిషన్, నగదు తీసుకోవడం చేస్తుంటారు. దీంతో వారు ఇప్పుడు రగిలిపోతున్నారు. తమ దగ్గరకు వచ్చి లబ్ధిదారులు బియ్యం తీసుకుపోతే.. వారికి కమీషన్ వచ్చేది. ఇప్పడు ఆ కమీషన్ రాకపోగా.. ఇంటికి వెళ్లి.. సరుకులు ఇస్తున్నందుకు ఏకంగా ఇరువై వేలు అదనంగా భరిస్తోంది ప్రభుత్వం. పైగా వాహనాలకు సబ్సిడీ రెండువేల వరకు భరిస్తోంది. పావాలతో పోయేదాన్ని పది రూపాయల వరకు ఖర్చు పెట్టడమే కాకుండా.. తమ ఆదాయాన్ని తగ్గించేశారని డీలర్లు మండి పడుతున్నారు. ప్రభుత్వానికి పోరాటానికి సిద్ధం అవుతున్నారు
Also Read: చంద్రబాబు ‘పంచాయతీ’ ప్లాన్లు.. మామూలుగా లేవుగా!
ఇలా రేషన్ డ్రైవర్లు ఆందోళన చేసి జీతం పెంచుకోవడంతో.. వలంటీర్ల కడుపు మండిపోతోంది. ఏడాదిన్నర నుంచి గొడ్డుచాకిరీ చేస్తుంటే.. తమ గురించి పట్టించుకోకుండా వారు అడిగిన వెంటనే రూ.5వేలు ఖర్చు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బియ్యం పంపిణీలో కూడా వలంటీర్ల పాత్ర ఉంది. తమతో అన్ని పనులు చేయించుకుంటారని మండి పడుతున్నారు. వీరి అసంతృప్తి వారికి కూడా తెలుసు. ఎప్పుడో ఏడాది క్రితం వలంటీర్ల జీతం రూ.8వేలు చేస్తామని ప్రభుత్వం లీకులిచ్చింది. కానీ చేయలేదు. దీంతో వలంటీర్లు ఉద్యమబాటకు సిద్ధం అవుతున్నారు. అవసరమైతే విధులు బహిష్కరించి.. సమ్మె చేస్తామంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
అయితే విజయసాయి రెడ్డి లాంటివారు వలంటీర్లలో 90శాతం మంది తమపార్టీవారేనని అంటుంటే.. వారైనా ఎంతకాలం రూ.5వేలకే పని చేస్తారనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు రేషన్ డీలర్లు , వాలంటీర్లే కాదు.. ఇతర వర్గాలు కూడా జీతాల పెంపుకోసం ఉద్యమబాట పట్టే అవకాశం ఉంది. ఒకరికి పెంచి మరొకరికి పెంచకపోతే… ఎవరికైనా కోపం రాక మానదనేది జగన్ ప్రభుత్వం గమనించుకోవాలని సూచిస్తున్నారు కొంతమంది నిపుణులు.