Puri Jagannadh: ఒకప్పుడు పూరీజగన్నాధ్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది పక్క ఇండస్ట్రీ హిట్ కొడుతుందనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయనకు బ్యాడ్ టైం నడుస్తుంది. సినిమాలపరంగా ఆయన కొంతవరకు వెనుకబడినప్పటికి ఎప్పటికప్పుడు పూరి ముసింగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఎప్పటికప్పుడు ఆక్టివేట్ చేస్తూ ఉంటాడు. అలాంటి పూరి జగన్నాధ్ తన పోడు కాస్ట్ ద్వారా ఒక అదిరిపోయే విషయాన్నీ అయితే జనాలకు తెలియజేశాడు. అది ఏంటి ఆయన ఏం చెప్పాడనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
ఎవ్రి బడి రీప్లేస్మెంట్ అనే పాయింట్ ను తెలియజేస్తూ ప్రేక్షకుల మైండ్ లో ఉన్న కొన్ని అపోహలను తుడిచేశాడు. ప్రతి ఒక్కరు తమ ఇంటిని తమ ఆఫీసుని మేమే చక్క పెడుతున్నాం. మా వల్లే వీళ్లంతా బతుకుతున్నారనే ఒక అపోహతో బతుకుతూ ఉంటారు. నిజానికైతే నేను అనే వాడిని లేకపోతే వీళ్ళు ఈ రేంజ్ లో ఉండే వాళ్ళు కాదు అంటూ కొంతమంది వాళ్ళని వాళ్ళు హైలెట్ చేసుకుంటూ ఉంటారు.
నిజానికి నువ్వు అనేవాడివి లేకపోతే నీ ప్లేస్ లో నీ పని చేయడానికి మరొక వ్యక్తి రీప్లేస్ మెంట్ గా వస్తూ ఉంటాడు. అంతేతప్ప అక్కడ పని మాత్రం ఆగదు… నీ రిటైర్మెంట్ రోజు నువ్వు ఎమోషనల్ గా స్పీచ్ ఇస్తుంటే నీ స్పీచ్ ఎప్పుడైపోతుందా ఎప్పుడు ఒక పెగ్ వేద్దామా అనే ఆలోచిస్తారు తప్ప నువ్వు పెట్టే కన్నీళ్లు గాని నీకున్న కష్టాలు గానీ అక్కడ ఎవ్వరు పట్టించుకోరు. నీ ప్లేస్ కాళీ అయిపోతే ఆ ప్లేస్ లోకి రావడానికి ఇంకొక కొత్త వ్యక్తి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాడు.
ఇక ఇలాంటి సమయంలో మనం ఇన్ని రోజులు వర్క్ చేశాం. మన డ్యూటీ అయిపోయింది మరొక వ్యక్తి ఆ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ మనల్ని మనం సంతృప్తి పరచుకోవాలి. అంతే తప్ప నేను లేకపోతే అది లేదు నేను లేకపోతే ఈ పని కాదు అనే ఒక వైఖరితో మనం ఉండడమనేది సరైన విషయం కాదు. నిజానికి నువ్వు అనేవాడివి లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అంటూ పూరి తన పోడ్ కాస్ట్ ద్వారా గొప్పగా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు…
ఇక ఏది ఏమైనా కూడా ఈ సృష్టిలో అమ్మకి, అమ్మ వండిన వంటకి తప్ప ప్రతిదానికి రిప్లేస్ మెంట్ అయితే ఉంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో పవర్, మనీ, సక్సెస్ అనేవి ఎప్పటికీ మనతో ఉండవు కాబట్టి అవి లేకపోయినా కూడా మనం బతకగలిగే ఒక కెపాసిటీని ఏర్పాటు చేసుకోవాలి అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం యూత్ ను అలరిస్తున్నాయనే చెప్పాలి…