Pushpa 2: అల్లు అర్జున్ ఫేమ్ చూసిన సినీ వర్గాల మైండ్ బ్లాక్ అవుతుంది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కుమ్మేస్తుంది. ఓపెనింగ్ డే పుష్ప 2 వసూళ్లు రూ. 150 కోట్లకు పైమాటే అంటున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు అమిత ఆసక్తి చూపుతున్నారు. పుష్ప 2 టికెట్స్ ధరలు భారీగా ఉన్నాయి. తెలంగాణాలో అయితే.. మల్టీఫ్లెక్స్ లలో టికెట్ ధర రూ. 500 అధికారికంగా దాటేసింది. అయినప్పటికీ బుకింగ్స్ జోరుగా ఉన్నాయి.
అదే సమయంలో పుష్ప 2 థియేట్రికల్ హక్కులు అత్యధిక ధరలకు అమ్మారు. రికవరీ చేయాలంటే మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాలి. తెలుగు రాష్ట్రాల వరకే పుష్ప 2 టార్గెట్ రూ. 420 కోట్లు అని సమాచారం. హిందీ వెర్షన్ రూ. 400 నుండి 500 కోట్లు రాబట్టాలి. టాక్ బాగుంటే… ఇదేమీ కష్టమైన టార్గెట్ కాదు. కాగా డిజిటల్ రైట్స్ లో కూడా పుష్ప 2 ఆల్ టైం రికార్డు నెలకొల్పిందట.
పుష్ప 1ని అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కేవలం రూ. 30 కోట్లకు ప్రైమ్ పుష్ప చిత్రాన్ని చేజిక్కించుకుంది. ఈసారి అంతకు పది రెట్లు ధర పెరిగింది. పుష్ప 2 డిజిటల్ రైట్స్ రూ. 270 కోట్లు అని సమాచారం. డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఈ మొత్తాన్ని చెల్లించి పుష్ప 2 ని కైవసం చేసుకుందట. ఆర్ ఆర్ ఆర్ డిజిటల్ రైట్స్ రూ. 170 కోట్లు పలికితే అదే రికార్డు అనుకున్నారు.
ఇక పుష్ప 2 విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలోకి వస్తుందని విశ్వసనీయ సమాచారం. ఆ లెక్కన జనవరి 23-25 తారీఖుల్లో అందుబాటులోకి తెస్తారట. సాధారణంగా థియేటర్స్ లోకి వచ్చిన నెల రోజుల్లో ఓటీటీ విడుదల ఉంటుంది. పుష్ప 2 కొరకు మరో ఇరవై రోజులు ఆగాల్సిందేనట. వరల్డ్ వైడ్ పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.