https://oktelugu.com/

Squid Game 2 : మనిషి ప్రాణాలను తీసే అతి భయంకరమైన గేమ్ షో వచ్చేస్తుంది..వణుకుపుట్టిస్తున్న లేటెస్ట్ టీజర్!

షోలో కూడా అదే విధంగా ఎలిమినేట్ అవుతుంటారు కానీ, ఇక్కడ ఎలిమినేషన్ అంటే చావడం అని అర్థం. టాస్కులలో ఓడిపోయిన వారిని చంపేస్తూ ఉంటారు. ఇలాంటి రియాలిటీ షో నిజ జీవితం లో జరగదు కానీ, ఈ కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో 'స్క్విడ్ గేమ్' అనే కొరియన్ వెబ్ సిరీస్ తెరకెక్కింది. 2021 వ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 2, 2024 6:45 pm
    Squid Game 2

    Squid Game 2

    Follow us on

    Squid Game 2 :  ఇది వరకు మనం ఎన్నో రియాలిటీ షోస్ చూసి ఉంటాము, ప్రతీ ఒక్క షో ఆడియన్స్ కి మంచి ఫన్ ని అందించేదే. వీటికి టీఆర్ఫీ రేటింగ్స్ కూడా అద్భుతంగా వస్తుంటాయి , ఉదాహరణకి మన బిగ్ బాస్ షోస్ లాంటివి అన్నమాట. సరిగ్గా ఇలాంటి రియాలిటీ షో లాగానే హాలీవుడ్ లో ఒక గేమ్ షో ఉంది. బిగ్ బాస్ హౌస్ లో  ప్రతీ వారం ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఈ షోలో కూడా అదే విధంగా ఎలిమినేట్ అవుతుంటారు కానీ, ఇక్కడ ఎలిమినేషన్ అంటే చావడం అని అర్థం. టాస్కులలో ఓడిపోయిన వారిని చంపేస్తూ ఉంటారు. ఇలాంటి రియాలిటీ షో నిజ జీవితం లో జరగదు కానీ, ఈ కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో ‘స్క్విడ్ గేమ్’ అనే కొరియన్ వెబ్ సిరీస్ తెరకెక్కింది. 2021 వ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

    ఇప్పుడు ఈ సిరీస్ కి సీక్వెల్ గా ‘స్క్విడ్ గేమ్ 2’ తెరకెక్కింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 26 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ సిరీస్ ని మన ఇండియన్ ఆడియన్స్ కూడా ఎగబడి చూసారు. కానీ చూడని వాళ్లకు ఈ సిరీస్ స్టోరీ లైన్ ని అందిస్తున్నాము. స్టోరీ ఏమిటంటే జీవితం లో ఎన్నో ఒడిదుడుగులను ఎదురుకునే సామాన్యులకు ఆశ చూపుతూ, ఒక వ్యక్తి కొన్ని సులువైన గేమ్స్ ఆడించి, ఆ సామాన్యులను గెలిపించి కొంత డబ్బుని ఇస్తాడు. ఇలాంటి గేమ్స్ ఇంకా ఆడాలని అనుకుంటున్నారా?, అయితే ఈ నెంబర్ కి కాల్ చేయండి అని ఒక కార్డు ఇస్తాడు. డబ్బు ఆశ చూసిన వాళ్ళు ఎందుకు ఇలాంటి అవకాశాలు వదులుకుంటారు చెప్పండి?, అందుకే  ఆ కార్డు మీద ఉన్న నెంబర్ కి ఫోన్ చేస్తారు. గేమ్ నిర్వహించేవాళ్ళు వాళ్ళ అడ్రస్ కి వచ్చి, మత్తు మందు అందించి , ఒక ఐల్యాండ్ కి తీసుకెళ్తారు. కాన్సెప్ట్ మొత్తం బిగ్ బాస్ హౌస్ లాగానే ఉంటుంది. కానీ ఇందులో ఓడిపోయిన వాళ్ళను చంపేస్తారు.

    ఈ విషయం తెలియకుండానే అక్కడికి ఈ అమాయకులందరు వస్తారు. మొదటి ఆట పూర్తి అవ్వగానే, గేమ్ ఎలా ఉంటాడో తెలుసుకొని కూడా, గెలిస్తే జీవితాంతం డబ్బు సమస్య లేకుండా బ్రతకొచ్చు అనే ఆశతో గేమ్ లో కొనసాగడానికి రిస్క్ చేస్తారు. అలా ఈ ఆటలో అందరూ చనిపోయి, చివరికి హీరో ఒక్కడు మిగిలి డబ్బులు గెలుచుకుంటాడు. బయటకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాణాంతక గేమ్స్ ఆడిస్తున్న వారిపై పగ తీర్చొని వాళ్ళ ఆటలను అరికట్టడానికి హీరో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే సీజన్ 2 చూడాల్సిందే.

    Squid Game: Season 2 | Official Teaser | Netflix