Rishabh Pant : దూకుడుగా ఆడతాడు.. వేగంగా కీపింగ్ చేస్తాడు..ఐనా పంత్ ను ఢిల్లీ ఎందుకు వద్దనుకుంది?

దూకుడుగా ఆడతాడు. వేగంగా కీపింగ్ చేస్తాడు. అద్భుతంగా పరుగులు తీస్తాడు. మైదానంలో నవ్వులు పూయిస్తాడు. నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ.. రిషబ్ పంత్ ను ఐపీఎల్ 2025 లో ఢిల్లీ జట్టు దూరం పెట్టింది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 2, 2024 6:52 pm

Rishabh Pant

Follow us on

Rishabh Pant : ఇటీవల బీసీసీఐకి సమర్పించిన రిటైన్ లిస్ట్ లో అతని పేరును నమోదు చేయలేదు. రిషబ్ పంత్ ఏ ఫార్మాట్లోనైనా దూకుడే మంత్రం గా ఆడతాడు. బౌలర్ ఎవరనేది లెక్క చేయడు. భారత జాతీయ జట్టులో కీలక భూమిక పోషిస్తున్నాడు ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుతో దాదాపు 9 సంవత్సరాల పాటు ప్రయాణ సాగిస్తున్నాడు. అయితే అతడికి రి టెన్షన్ లిస్టులో అవకాశం లభించలేదు. ఫలితంగా అతడు మెగా వేలంలోకి రావడం దాదాపుగా ఖాయమైంది. అత్యంత కీలక ఆటగాడిగా ఉన్న అతడిని ఢిల్లీ జట్టు కాదనుకోవడానికి కారణాలను ఒకసారి అన్వేషిస్తే.. ఢిల్లీ జట్టులో జిఎంఆర్ గ్రూప్ కూడా ఒక భాగస్వామి. ఆ గ్రూప్ తీసుకున్న నిర్ణయం వల్లే పంత్ బయటికి వెళ్లాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే కోచింగ్ సిబ్బంది విషయంలో జిఎంఆర్ గ్రూప్ మార్పులు చేర్పులు చేసింది. పంత్ విషయంలోనూ అదే చేసింది. ప్రధాన కోచ్ గా హేమంగ్ బధాని, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా వేణుగోపాలరావును జిఎంఆర్ గ్రూప్ నియమించింది. పంత్ స్థానంలో అక్షర్ పటేల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించాలని జిఎంఆర్ గ్రూప్ ఒక నిర్ణయానికి వచ్చింది. అందువల్లే రిషబ్ పంత్ ఢిల్లీ జట్టును విడిచి వెళ్లిపోయాడని తెలుస్తోంది. ఢిల్లీ జట్టులో జేఎస్ డబ్ల్యూ గ్రూప్, జిఎంఆర్ గ్రూప్ కు 50:50 శాతం వాటాలు ఉన్నాయి. ఇప్పటివరకు జేఎస్ డబ్ల్యూ నిర్ణయాలు తీసుకుంది. ఇకపై 2025, 2026 సీజన్లకు సంబంధించి జిఎంఆర్ గ్రూపు నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్లే ఇప్పటివరకు ప్రధాన కోచ్ గా కొనసాగిన రికీ పాంటింగ్ ను పక్కన పెట్టింది. డైరెక్టర్ గా ఉన్న సౌరవ్ గంగూలీని కూడా దూరం పెట్టింది.. మొత్తంగా ప్రక్షాళన పేరుతో అనేక మార్పులు చేర్పులు చేస్తోంది.

జట్టు.. సమూల ప్రక్షాళన

తెలుగు ఆటగాడు వేణుగోపాలరావుకు ముఖ్య పదవి ఇచ్చింది. ఒకప్పటి సీనియర్ ఆటగాడు హేమాంగ్ బదానీ కి కీలక అవకాశం కల్పించింది. మొత్తంగా చూస్తే ఢిల్లీ జట్టును సమూలంగా మార్చే పనిలో పడింది జిఎంఆర్ గ్రూప్. అక్షర్ పటేల్ నాయకత్వంలో ఢిల్లీ జట్టు ఈసారి సరికొత్త విజయాలను సాధిస్తుందని.. ట్రోఫీ రేస్ లో ఉంటుందని జిఎంఆర్ వర్గాలు చెబుతున్నాయి. వేలంలోనూ సమర్థవంతమైన ఆటగాళ్లను కొనుగోలు చేయాలని జిఎంఆర్ గ్రూప్ భావిస్తోంది. ” జట్టు రూపు రేఖలు మారాలి. వచ్చే రెండు సీజన్లు మాకు అత్యంత కీలకం. నాణ్యమైన ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తాయి. జట్టు కోసం ఆడే వారికోసం రెడ్ కార్పెట్ పరిచి ఉంటుంది. అలాంటప్పుడు కొత్త ప్రయోగాల కోసం మేము పాకులాడుతూనే ఉంటాం. అంతిమంగా కావాల్సింది మాకు విజయం. దానికోసం కసరత్తు మొదలు పెట్టామని” జిఎంఆర్ వర్గాలు చెబుతున్నాయి.