War 2 : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు భారీ విజయాలను సాధిస్తున్నారు. కానీ బాలీవుడ్ లో మాత్రం స్ట్రైట్ గా సినిమాలను చేయడానికి మన హీరోలెవ్వరు అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో సైతం ప్రస్తుతం హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు…
ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR) బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్ 2(War 2) అనే సినిమా చేస్తున్నాడు. అయితే హృతిక్ రోషన్(Hruthik Roshan) తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా ఎన్టీయార్ తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక గత సంవత్సరం వచ్చిన ‘దేవర’ (Devara) సినిమాతో ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో అలరించలేకపోయాడు. కేవలం ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టడంతో పాన్ ఇండియాలో ఎన్టీఆర్ కి అంత పెద్ద మార్కెట్ అయితే లేదనే ఒక బ్యాడ్ ఇమేజ్ అయితే మూటగట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో పాన్ ఇండియాలో తనకు భారీ గుర్తింపైతే ఉంది. అలాగే సూపర్ సక్సెస్ లను సాధించగలను తద్వారా కలెక్షన్స్ ని కొల్లగొట్టగలిగే కెపాసిటి తనకు ఉందని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే వార్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో ఆది పురుషు(Adipurush) సినిమా విషయంలో ఒకసారి రుజువు అయింది. మరి అన్ని తెలిసి కూడా బాలీవుడ్ దర్శకులతో సినిమా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణం ఏంటి? అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ సెకండ్ హీరోగా నటిస్తున్నాడంటు బాలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పటికే చేసిన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాలో కూడా సెకండ్ హీరో ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాలో కూడా అదే ఇమేజ్ వచ్చినట్లు అయితే మాత్రం పాన్ ఇండియాలో జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా రాణించలేడు.
అతను సెకండ్ హీరోకి మాత్రమే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆచితూచి ముందుకు వెళ్లాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనకు నచ్చినట్టుగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడం అనేది తన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని ఇబ్బందికి గురిచేస్తుంది. ముఖ్యంగా వార్ 2 సినిమా ఎందుకు చేస్తున్నాడు.
దాని ద్వారా అతనికి ఏ మాత్రం ప్రయోజనం ఉండదు అనే వాదనను కొంతమంది సినిమా మేధావులు సైతం తెలియజేస్తూ ఉండడం విశేషం…చూడాలి మరి ఈ సినిమా వల్ల ఆయనకి ఏమైనా ప్లస్ అవుతుందా. లేదంటే ఇప్పటిదాకా ఉన్న ఇమేజ్ కూడా పోతుందా అనేది…