Vijay Deverakonda- Samantha: గత ఏడాది ప్రారంభంలోనే విజయ్ దేవరకొండ, సమంత తమ ప్రాజెక్ట్ ‘ఖుషి’ని వెల్లడించారు. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభమైంది. కాశ్మీర్‌లో సెట్‌లో టీమ్ తో సమంత తన పుట్టినరోజును కూడా జరుపుకుంది. అయితే ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలుకాగానే సమంతకు మైయోసైటిస్ వ్యాధి సోకడంతో చిత్రీకరణ చాలా కాలం పాటు ఆగిపోయింది.
ఇక తన ఆరోగ్య సమస్య వల్ల షూటింగులో సమంత పాల్గొనలేక పోవడంతో ఎనిమిది నెలల పాటు సినిమా షూటింగ్ సస్పెండ్ అయింది. అదే సమయంలో, విజయ్ దేవరకొండ, ఇతర కమిట్‌మెంట్‌లను కలిగి ఉన్నప్పటికీ, వేరే ప్రాజెక్టుకి వెళ్లకుండా సమంత కోసం వెయిట్ చేశారు. సమంత కోలుకోవడానికి దాదాపు 8 నెలలు పట్టినా కానీ ఎంతో ఓర్పుతో దేవరకొండ సమంత కోసం తన ఖుషి సినిమాని హోల్డ్ లో పెట్టి ఉంచారు.
ఇప్పుడు ఖుషి ట్రైలర్ లాంచ్ లో ఈ విషయం గురించి ప్రశ్నించగా, విజయ్ మాట్లాడుతూ “ఈ పాత్రలో సమంత తప్ప మరెవరినీ నేను ఊహించలేను. అందుకే సమంత కోలుకోవడానికి అవసరమైనంత కాలం వేచి ఉండటానికి నేను సిద్ధం అయిపోయా. ఒకవేళ సమంత తిరిగి రావడానికి ఒక దశాబ్దం పట్టినా నేను ఓపికగా వేచి ఉండేవాడిని.” అని తెలియజేశారు.
మరోపక్క దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ఆరాధ్య క్యారెక్టర్ కేవలం సమంతన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించానని, మరెవరిని ఆ క్యారెక్టర్ లో ఊహించుకోలేనని చెప్పాడు.
గతంలో సమంత, శివ నిర్వాణ కలిసి చేసిన “మజిలీ” సినిమా సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ దర్శకుడు హీరోయిన్ కలిసి చేస్తున్న రెండవ సినిమా ఇది.
ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ప్రస్తుతం, విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో తన రాబోయే ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ చిత్రం “గీత గోవిందం” తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఈ కొత్త వెంచర్‌లో, అతనితో పాటు మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నేతృత్వంలో విజయ్ మరో ప్రామిసింగ్ ప్రాజెక్ట్ పనిలో ఉన్నాడు.