Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇక విలన్ పాత్రల్లో నటించరా?

తెలుగులో ఉప్పెన సినిమాతో విలన్ పాత్రలో నటిస్తే.. బాలీవుడ్ లో జవాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు మక్కల్ సెల్వన్. ఈ సినిమాలకంటే ముందు తమిళ్ లో మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాల్లో కూడా నటించారు.

Written By: Swathi, Updated On : March 13, 2024 12:50 pm

Vijay Sethupathi villain roles

Follow us on

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఈ పేరు వింటే తమిళ యాక్టర్ అంటారు కానీ తెలుగులో కూడా ఎనలేని అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ స్టార్ హీరో. మక్కల్ సెల్వన్ అని అభిమానులు ముద్దుగా పిలచుకుంటారు కూడా. ఇక హీరో పాత్రల్లో ఏ రేంజ్ లో అభిమానించారో.. విలన్ పాత్రలతో కూడా అదే రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్నారు ఈ స్టార్ హీరో. అయితే తెలుగులో ఉప్పెన సినిమాతో విలన్ పాత్రలో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ సినిమాతో విలన్ పాత్రల్లో నటించడం ప్రారంభించారు విజయ్.

తెలుగులో ఉప్పెన సినిమాతో విలన్ పాత్రలో నటిస్తే.. బాలీవుడ్ లో జవాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు మక్కల్ సెల్వన్. ఈ సినిమాలకంటే ముందు తమిళ్ లో మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాల్లో కూడా నటించారు. హీరోతో సంపాదించిన పేరును విలన్ తో కూడా సంపాదించారు. ఈయన ఏ పాత్ర చేసినా సూపర్ హిట్టే అనే రేంజ్ లో టాక్ వస్తుంది. అయితే సడన్ గా మక్కల్ తన నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. విలనిజంతో నటించిన ఈయన ఇక అలాంటి పాత్రలు చేసేదే లేదంటున్నారట.

కేవలం హీరో కథలను మాత్రమే తనకు చెప్పాలని.. విలన్ పాత్రల్లో నటించేది లేదని చెప్పారట దర్శకనిర్మాతలకు. నేను చేయాలనుకున్న పాత్రలన్నీ చేసేశాను.. ఇకపై హీరోగా మాత్రమే కంటిన్యూ అవుతాను అంటున్నారట. కేవలం హీరో కథలను మాత్రమే తనకు వినిపించాలి అంటున్నారట. ఇటీవల నార్త్ రామాయణంలో విభీషణుడి పాత్ర కోసం ఆఫర్ వస్తే.. నిమిషం ఆలోచించకుండా నో అనేసాడట విజయ్ సేతుపతి. ఇంత పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలో నో చెప్పడంతో ఆయన అభిమానులు నిరాశ పడుతున్నారు.

విజయ్ సేతుపతి తొందరపడి నిర్ణయం తీసుకున్నారని.. ఇప్పుడిప్పుడే ఈయనకు దేశ వ్యాప్తంగా అభిమానులు పెరుగుతుంటే.. ఇలాంటి నిర్ణయం ఏంటి అనే చర్చ సాగుతోంది. హీరోగా ఎంతో మంది అభిమానులు ఉన్నా.. ఈయనను విలన్ పాత్రల్లో కూడా ఆహ్వానించే అభిమానులు పెరిగిపోయారు. మరి తన తర్వాత ప్రాజెక్ట్ లను ఎలా ఎంచుకుంటారో? ఎలాంటి సినిమాలకు ఒకే చేస్తారో చూడాలి. అయినా విజయ్ ను హీరోగా చూడాలని ఆశపడే వారే ఎక్కువ. మరి చూడాలి ఇక నుంచి ఈ స్టార్ హీరో కెరీర్ ఎలా ఉండనుందో..