Vaishnavi Chaitanya- Payal Rajput: టాలీవుడ్ లో స్టార్ ఇమేజి ఉన్న హీరోయిన్లు నెగటివ్ రోల్స్ చెయ్యడం కొత్తేమి కాదు. నిన్నటి తరం హీరోయిన్స్ అయిన రమ్య కృష్ణ , సౌందర్య, సిమ్రాన్ వంటి వారు స్టార్ హీరోయిన్స్ గా చక్రం తిప్పుతున్న రోజుల్లోనే నెగటివ్ క్యారెక్టర్స్ లో కూడా నటించి అందరినీ మెప్పించారు. ఇక నేటి తరం హీరోయిన్స్ లో సమంత , తమన్నా వంటి సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ కూడా నెగటివ్ రోల్స్ లో జీవించారు.
పెద్ద స్టార్ ఇమేజి ఉన్న హీరోయిన్స్ నెగటివ్ రోల్స్ చెయ్యడం వల్ల వారి మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. కానీ ఇండస్ట్రీ కి వచ్చే కొత్త హీరోయిన్స్ నెగటివ్ రోల్స్ చేస్తే దాని ప్రభావం వారి కెరీర్ మీదనే పడుతుంది అనడానికి ఉదాహరణ ‘పాయల్ రాజ్ పుత్’. ఈమె అజయ్ భూపతి అనే దర్శకుడు తెరకెక్కించిన ‘RX 100 ‘ తో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.
ఈ సినిమాలో ఆమె మితిమీరిన రొమాన్స్ ఒక పక్క చేస్తూనే, పూర్తి స్థాయి నెగటివ్ రోల్ ని చేసింది. దీని ప్రభావం ఆమె కెరీర్ మీద బలంగా పడింది, అన్నీ అదే తరహా పాత్రలు రావడం తో చివరికి బి గ్రేడ్ హీరోయిన్ గా జనాల్లో ముద్ర వేసుకుంది. అందువల్ల ఈమెకి ఒక్క స్టార్ హీరో కూడా తమ సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు వైష్ణవి చైతన్య కెరీర్ కూడా అలాగే అవ్వబోతుందా?, రీసెంట్ గా విడుదలై బేబీ చిత్రం తో బాక్స్ ఆఫీస్ ని ఊపేసే రేంజ్ హిట్ ని అందుకొని ఇండస్ట్రీ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఈ సినిమాలో ఆమె బోల్డ్ గా ఉంటూనే నెగటివ్ టచ్ ఉన్న పాత్రని పోషించింది. రెస్పాన్స్ అదిరిపోయింది. కలెక్షన్ల వర్షం కురిసింది. కానీ అవకాశాలు వస్తున్నాయి కదా అని ఇదే తరహా బోల్డ్ పాత్రలు చేసుకుంటూ పోతే ఈమె కూడా మరో పాయల్ రాజ్ పుత్ అయిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఆమె తన కెరీర్ ని ఎలా మలుచుకుంటుందో చూడాలి.