Homeఎంటర్టైన్మెంట్Hidimbha Trailer Review: హిడింబ ట్రైలర్ రివ్యూ: ఆసక్తి రేపుతున్న క్రైమ్ థ్రిల్లర్!

Hidimbha Trailer Review: హిడింబ ట్రైలర్ రివ్యూ: ఆసక్తి రేపుతున్న క్రైమ్ థ్రిల్లర్!

Hidimbha Trailer Review: స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు జీనియస్ మూవీతో హీరో అయ్యాడు. ఈ చిత్రానికి ఓంకార్ దర్శకుడు. అన్నదమ్ముల కాంబినేషన్ లో వచ్చిన రాజుగారి గది సూపర్ హిట్ అయ్యింది. ఈ సిరీస్లో మరో రెండు చిత్రాలు వచ్చాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రాజుగారి గది 3 అంతగా ఆడలేదు. దీంతో మనోడికి కొంచెం గ్యాప్ వచ్చింది. తాజాగా హిడింబ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు.

నేడు హిడింబ ట్రైలర్ విడుదల చేశారు. రివర్స్ మోడ్ లో ట్రైలర్ ఆసక్తిగా సాగింది. కేవలం నిమిషం నిడివి కలిగిన ట్రైలర్ లో ఒక్క డైలాగ్ లేదు. విజువల్స్ బాగున్నాయి. యాక్షన్, సస్పెన్స్ అంశాలతో కూడి ఉంది. పోలీస్ గా అశ్విన్ బాబు లుక్ ఆకట్టుకుంది. కోరమీసంతో మ్యాన్లీగా ఉన్నాడు. ఈ పాత్ర కోసం అశ్విన్ బాగానే హోమ్ వర్క్ చేసినట్లున్నాడు. బాడీ డెవలప్ చేశాడు.

ఈ మూవీలో నందిత శ్వేత హీరోయిన్ గా నటించడం విశేషం. ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం తర్వాత నందిత శ్వేతకు హిట్ పడలేదు. ఆమె ఢీ షోలో సందడి చేస్తున్నారు. నందిత శ్వేతకు కూడా సిల్వర్ స్క్రీన్ మీద బ్రేక్ వచ్చింది. హిడింబ మూవీలో సోలో హీరోయిన్ గా అల్లాడించనుంది. ట్రైలర్ ఆకట్టుకున్న నేపథ్యంలో మూవీపై అంచనాలు పెరిగాయి.

కాగా విడుదలకు ముందే హిడింబ లాభాలు పంచినట్లు సమాచారం. డిజిటల్ రైట్స్ రూపంలో బాగా రాబట్టిన ఈ మూవీ ఆల్రెడీ హిట్ అంటున్నారు. హిడింబ చిత్రానికి అనీల్ కన్నెగంటి దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. వికాస్ బడిస సంగీతం అందిస్తున్నారు. హిడింబ జులై 20న విడుదల కానుంది.

Hidimbha Reverse Action Trailer | Ashwin Babu | Nandita Swetha | Aneel Kanneganti | Anil Sunkara |

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version