Nani: అష్ట చమ్మ సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన నాని ఆ సినిమాతో మొదటి విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ప్రస్తుతం స్టార్ హీరో ఇమేజ్ ని సంపాదించే రేంజ్ కి చేరుకున్నాడు. ఇక స్టార్ హీరో అవ్వడానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోతున్న నాని ప్యారడైజ్ సినిమాతో ఆ కోరికను తీర్చేసుకుంటాను అనే నమ్మకంతో ఉన్నాడు. మొన్నటి వరకు మన పక్కింటి అబ్బాయిల కనిపించే నాని ఇప్పుడు బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించిన వాళ్ళలో నాని కూడా ఒకరు. కానీ ఆయన బోల్డ్ కంటెంట్ తో సినిమా చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్ కి వస్తారా? నాని ఎందుకని ఇలాంటి సినిమాలను ఎంచుకుంటున్నాడని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది మాత్రం సాఫ్ట్ సినిమాలు చేస్తూ వెళ్తున్న కొద్ది మీడియం రేంజ్ హీరో గానే గుర్తింపు సంపాదించుకుంటారు తప్ప టాప్ పొజిషన్ కి వెళ్లలేరు. కాబట్టి నాని మాస్ సినిమాలను చేస్తేనే బాగుంటుంది. అలా అయితేనే ఆయన మరోసారి తన సత్తా చాటుతాడు.
ఆయన టైర్ వన్ హీరోల లిస్టు కి చేరుతాడు అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా నాని ప్యారడైజ్ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకుంటాడు. కానీ తర్వాత చేయబోయే సినిమాలతో అతనికి చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే ఆయన నుంచి వచ్చే సినిమాలన్ని మాస్ సినిమాలే కాబట్టి ఇక మీదట రాబోయే సినిమాలు ప్యారడైజ్ ను మించి ఉండాలి.
అలా అయితేనే ఆ మూవీ సక్సెస్ సాధిస్తోంది. లేకపోతే భారీగా దిజపయింట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నాని కంటెంట్ ఉన్న దర్శకులను వెతకాలి. లేకపోతే మాత్రం సినిమా మొత్తానికి దెబ్బ పడే అవకాశాలైతే ఉన్నాయి. ఒకవేళ ప్యారడైజ్ తర్వాత సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే నాని కెరియర్ కూడా తర్వాత కష్టమవుతుందనే చెప్పాలి.
ఇలాంటి సమయంలోనే తన కెరియర్ ని చాలా బాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తే నాని టైర్ వన్ హీరోగా కాకుండా మీడియం రేంజ్ హీరోగా సక్సెస్ ను సాధించగలుగుతాడు. లేకపోతే మాత్రం ఆయన కెరియర్ ఢీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి… వీటన్నింటినీ మైండ్లో పెట్టుకొని ముందుకు సాగితేనే నాని కెరియర్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగుతోంది…