Shamili: అప్పటి బాల నటి బేబి షామిలి గుర్తుండే ఉంటుంది. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఆ రోజుల్లోనే అత్యధిక పారితోషికం పొందిన బాలనటిగా గుర్తింపు పొందింది. ఇంకా మణిరత్నం తీసిన అంజలి సినిమాలో కూడా ఓ పాత్రను అవలీలగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ముద్దు ముద్దు మాటలతో అభిమానులను సంపాదించుకుంది. దాదాపు 42 సినిమాల్లో నటించి తన ప్రతిభను చాటుకుంది. అతి చిన్న వయసులోనే నటనలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నటి షామిలి.

కానీ షామిలి పెద్దయ్యాక మాత్రం సినిమాలకు దూరమైంది. ఒక్క సిద్ధార్థ్ తోనే ఓయ్ అనే సినిమాలో నటించినా అది ప్రేక్షకాదరణ పొందలేదు. సరికదా ఆమెపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెకు కథానాయిక పాత్రలు దక్కలేదు. ఫలితంగా సినిమాలకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. హీరోయిన్ అయ్యాక బాలనటిగా ఉన్న ఆదరణ మాత్రం కనిపించలేదు. దీంతోనే ఆమెకు అవకాశాలు దరిచేరలేదని తెలుస్తోంది.
Also Read: షాకింగ్ : ఆ దిగ్గజ దర్శకుడు ఇక లేరు
బాలనటిగా దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. కానీ కాలక్రమంలో ఆమె నటనకు దూరమైపోయింది. హీరోయిన్ అయ్యాక మాత్రం ఆమెకు అవకాశాలు దరిచేరలేదు. ఓయ్ తరువాత రెండు సినిమాలకు ఆఫర్లు వచ్చినా ఆమె డిమాండ్లు ఎక్కువగా ఉండటంతో అవకాశాలు చేజారినట్లు తెలుస్తోంది.
స్టార్ హీరో ధనుష్ తో నటించేందుకు ఆఫర్ వచ్చింది. కానీ ఆమె మిస్ చేసుకున్నట్లు సమాచారం. ఆమె అక్క కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన విషయం తెలిసింది. ఆమె షాలిని. హీరో అజిత్ ను వివాహం చేసుకుని స్థిరపడిపోయింది. కానీ షామిలికి మాత్రం అవకాశాలు రావడం లేదు. బాలనటిగా గుర్తింపు పొందిన ఆమెకు హీరోయిన్ గా మాత్రం క్రేజీ రాకపోవడం గమనార్హం.
Also Read: సీనియర్ దర్శకుడు పీ చంద్రశేఖర్ రెడ్డి కన్నుమూత… ఎమోషనల్ అయిన సూపర్ స్టార్ కృష్ణ