ABN Radha Krishna: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎప్పటికప్పుడు విషం చిమ్ముతున్న వారిలో మొదటి వరుసలో ఉంటాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అవకాశం దొరికినప్పుడల్లా తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంటాడు. ఇటీవలే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఈ క్రమంలో సీఎం స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయనను కలిశారు. ఈ విషయాన్ని ఏ మాత్రం సహించలేకపోతున్నట్టు అనిపిస్తుంది రాధాకృష్ణ. సీజేఐను సీఎం జగన్ కలవడాన్ని మాత్రం రాధాకృష్ణ ఎంత మాత్రం ఇష్టం లేనట్టు కనిపిస్తోంది.
తనపైన ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు ఆయన సీజేఐను జగన్ మోహన్ రెడ్డికి కలిశాడని ఆయన అభిప్రాయం. అంటే న్యాయ వ్యవస్థపైన రాధాకృష్ణకు నమ్మకం లేదనే తెలుస్తోంది. గతంలో సీజేఐపై సీఎం జగన్ ఫిర్యాదు చేశారని, ఇక ఆయనకు కలిసే అర్హత లేదనేది రాధాకృష్ణ అభిప్రాయం. ఒక వ్యక్తి సీఎం స్థాయిలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను కలిస్తే అదేదో జరిగిపోతుందని, సీఎం జగన్ కు అనుకూలంగా తీర్పు వస్తుందని రాధాకృష్ణ కామెంట్స్‌లో కనిపిస్తోంది. తీర్పు వెలువడక ముందే సీఎం ఆర్థిక నేరస్తుడని డిసైడ్ చేసినట్టుంది రాధాకృష్ణ మాటలు.
Also Read: అత్యంత సన్నిహితుల మధ్య రెహమాన్ కూతురు ఎంగేజ్మెంట్… పెళ్లి కొడుకు ఎవరంటే ?
వివేకానంద రెడ్డి హత్య కేసులోనూ రాధాకృష్ణ ఓ పరిశోధన వెల్లడించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి, అతని తండ్రి తొందరలోనే జైలుకెళ్లడం ఖాయమని తెలిపారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎదుట సాక్ష్యం చెప్పడానికి వైఎస్ షర్మిల రెడీ అయ్యారంటూ చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే.. వైఎస్ వివేకా బతికున్న టైంలో వీరిద్దరిలో ఒకరు కడప నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌గా పోటీ చేస్తామని చెప్పారట. అదే విషయాన్ని షర్మిల అధికారుల ఎదుట చెబితే ప్రకంపనలు వస్తాయట.
మరి దీనిని సాక్ష్యంగా పరిగణిస్తారా అంటే ప్రశ్నార్థమే. వివేక కూతురు సునీత తనకున్న అనుమానాలను ఇప్పటికే సీబీఐ ముందు ఉంచారు. ఇది కాకుండా షర్మిలను కలవనీయకుండా జగన్ కట్టడి చేస్తున్నారనేది రాధాకృష్ణ వాదన. ఇక పూర్తిగా జగన్ కు అందరూ దూరమవుతున్నారని ఆయన అభిప్రాపపడుతున్నారు. 2019లో దేవుడు రాసిన స్క్రిప్ట్.. ఈ ఏడాదిలో మారుపోతుందని చెబుతున్నాడు. అంటే దీని ప్రకారం ఈ ఏడాది జగన్ జైలుకు వెళ్లాలి. చంద్రబాబును సైతం డేరింగ్ డాషింగ్ అంటు ఆకాశానికెత్తేశాడు రాధాకృష్ణ.