https://oktelugu.com/

AR Rahman: అత్యంత సన్నిహితుల మధ్య రెహమాన్ కూతురు ఎంగేజ్మెంట్… పెళ్లి కొడుకు ఎవరంటే ?

AR Rehaman: ఏఆర్‌ రెహమాన్‌ పేరు తెలియని భారతీయులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అరుదైన ఆస్కార్‌ అవార్డును గెలుచుకుని… సంగీత దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఏఆర్‌ రెహమాన్‌. అయితే ఇప్పుడు  ఏఆర్‌ రెహమాన్ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆయన పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్‌ కు ఎంగేజ్‌ మెంట్‌ జరిగింది అని తెలుస్తుంది. తాజాగా అత్యంత సన్నిహితుల మధ్య ఆమె నిశ్చితార్థం వేడుకగా జరిగింది. ఈ శుభవార్తను ఖతీజా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 3, 2022 / 12:15 PM IST
    Follow us on

    AR Rehaman: ఏఆర్‌ రెహమాన్‌ పేరు తెలియని భారతీయులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అరుదైన ఆస్కార్‌ అవార్డును గెలుచుకుని… సంగీత దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఏఆర్‌ రెహమాన్‌. అయితే ఇప్పుడు  ఏఆర్‌ రెహమాన్ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆయన పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్‌ కు ఎంగేజ్‌ మెంట్‌ జరిగింది అని తెలుస్తుంది. తాజాగా అత్యంత సన్నిహితుల మధ్య ఆమె నిశ్చితార్థం వేడుకగా జరిగింది. ఈ శుభవార్తను ఖతీజా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

    అదే విధంగా తనకు కాబోయే భర్తను కూడా అందరికీ పరిచయం చేసింది. ఆడియో ఇంజినీర్‌, వ్యాపారవేత్త అయిన రియాసిద్దీన్‌ షేక్‌ మహ్మద్‌తో త్వరలో ఆమె నిఖా జరగనుంది. అయితే పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు అని సమాచారం. కాగా చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అందుకే ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు కూడా బయటకు రాలేదు. అయితే ఖతీజా తన భర్త ఫొటోను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది.

    దీంతో ఇవి కాస్తా వైరల్‌ గా మారాయి. కాగా రెహ్మాన్ కు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. ఖతీజా పెద్ద కూతురు కాగా చిన్నకూతురు పేరు రహీమా. కుమారుడి పేరు అమీన్ రెహ్మాన్. ఇక తండ్రి బాటలోనే పయనిస్తోన్న ఖతీజా కూడా మంచి గాయనిగా పేరు తెచ్చుకుంది. ‘ఫరిష్టోన్’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌ను ఆమె విడుదల చేసింది. ఈ మ్యూజిక్ వీడియో ఉత్తమ యానిమేషన్ మ్యూజిక్ వీడియోగా గుర్తింపు పొందింది. ఇక చిన్న కూతురు రహీమా బాలీవుడ్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రెహమాన్ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.