Tollywood Heroine: ప్రియురాలి మోజులో పడి భార్యతో విడాకులు తీసుకున్న వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా చాలామంది ఇలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ ఒక స్టార్ హీరోతో అక్రమ సంబంధం పెట్టుకుని తన కెరియర్ నాశనం చేసుకుంది. ఒక ప్రముఖ దర్శకుడు, నిర్మాత చేతుల మీదుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కూడా హీరోయిన్ తన కెరియర్ను నిలబెట్టుకోలేకపోయింది. ఎంత వేగంగా స్టార్డం సొంతం చేసుకుందాం అంతే వేగంగా ఆమె పాతాళానికి పడిపోయింది. ఈ హీరోయిన్ మరెవరో కాదు నిఖిత తుక్రల్. నిఖిత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నికిత ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఈమె ఎకనామిక్స్ లో ఎం ఏ పూర్తి చేసింది. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే నిఖితకు అదృశ్యం తలుపు తట్టి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ప్రముఖ దర్శకుడు డి రామానాయుడు గారు ఒకరోజు ముంబైలో జూహులోని ఒక హోటల్లుల భోజనం చేస్తున్న సమయంలో నిఖితను చూడడం జరిగింది. నిఖిత అందం, చలాకితనం చూసిన డి రామానాయుడు గారు తన తర్వాతి సినిమా హాయ్ లో హీరోయిన్ గా నిఖితకు చాన్స్ ఇవ్వాలని ఆమెను సంప్రదించారు.
Also Read: అల్లు అర్జున్, చిరంజీవి మధ్య ఆసక్తికరమైన పోరు..గెలిచేది ఎవరో!
హీరోయిన్ గా అవకాశం రావడంతో నిఖిత కూడా ఎగిరి గంతేసింది. ఈ సినిమాతోనే ఇవి సత్యనారాయణ కుమారుడు ఆర్యన్ రాజేష్ కూడా హీరో గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో హీరోయిన్ గా నిఖితకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఈమెకు తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో కూడా వరుసగా ఆఫర్స్ వచ్చాయి. తెలుగులో ఈమె తక్కువగా సినిమాలు చేసినప్పటికీ తమిళ్, కన్నడ సినిమా ఇండస్ట్రీలో మాత్రం వరుసగా సినిమాలు చేసే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చాలాకాలం గ్యాప్ తర్వాత నిఖిత తెలుగులో అవును 2, టెర్రర్ సినిమాలలో నటించింది. కానీ ఆ సినిమాలు నికిత కెరీర్ కు ప్లస్ కాలేకపోయాయి.
కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే నిఖిత కన్నడ నటుడు దర్శన్ తూగు దీపతో నికిత అఫైర్ నడుస్తున్నట్లు అప్పట్లో శాండిల్ వుడ్ లో పలు వార్తలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే వీటిని అందరూ కేవలం పుకార్లు లాగానే కొట్టి పడేశారు. ఆ తర్వాత దర్శన్ భార్య విజయలక్ష్మి వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ నిజమైన అంటూ తెలిపారు. అప్పట్లో దర్శన్ భార్య విజయలక్ష్మి నిఖితతో సంబంధం పెట్టుకొని తన భర్త దర్శన్ తనను వేధిస్తున్నాడని, గన్ తో కాల్చి చంపుతానని బెదిరిస్తున్నాడని పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు దర్శన్ పై కేసు నమోదు చేసే అరెస్టు కూడా చేశారు. ఈ ఘటనతో కన్నడ సినిమా పరిశ్రమ హీరోయిన్ నికిత పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడేళ్ల పాటు నిఖితకు సినిమాలలో నటించే అవకాశం లేకుండా బ్యాన్ కూడా విధించింది. దాంతో ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి.
Also Read: ‘రెట్రో’ ప్రభంజనం..కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన గ్రాస్ ఎంతంటే!