https://oktelugu.com/

Prabhas Adipurush: ‘ఆదిపురుష్’ థియేటర్స్ లో ‘సలార్’.. ఒకే రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కి 2 పండుగలు!

కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ తప్ప టీజర్ దాదాపుగా సిద్ధం అయ్యిపోయినట్టే అని అంటున్నారు. ఈ టీజర్ వచ్చే నెల 16 వ తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేసున్నారట. 16 వ తారీఖున ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'ఆదిపురుష్ ' విడుదల అవ్వబోతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : May 26, 2023 / 03:19 PM IST

    Prabhas Adipurush

    Follow us on

    Prabhas Adipurush: కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రభాస్ ‘సలార్’ మూవీ టీజర్ అప్డేట్ అతి త్వరలోనే రాబోతుంది. KGF సిరీస్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 23 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా రీసెంట్ గానే టీజర్ కట్ ని సిద్ధం చేశారట.

    కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ తప్ప టీజర్ దాదాపుగా సిద్ధం అయ్యిపోయినట్టే అని అంటున్నారు. ఈ టీజర్ వచ్చే నెల 16 వ తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేసున్నారట. 16 వ తారీఖున ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్ ‘ విడుదల అవ్వబోతుంది.

    ‘సలార్’ టీజర్ కట్ ని ‘ఆదిపురుష్’ సినిమాతో అటాచ్ చేసి విడుదల చేయబోతున్నారట.అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి జూన్ 16 వ తారీఖు నుండి థియేటర్స్ లో డబుల్ బొనాంజా అన్నమాట. ఈ టీజర్ ప్రశాంత్ నీల్ మార్కు తో ఉంటుందని, పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ప్రభాస్ హీరోయిజం ని ఎలివేట్ చేస్తూ టీజర్ ప్రారంభం అవుతుందని, ఆ తర్వాత ప్రభాస్ పవర్ ఫుల్ డైలాగ్స్ మరియు అదిరిపోయే యాక్షన్ కట్స్ కూడా ఈ టీజర్ లో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికీ ఈ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.

    టీజర్ గురించి నేడు బయటకి వచ్చిన సమాచారం కి తగ్గట్టుగా ఉంటే మాత్రం , బాహుబలి 2 ఫుల్ రన్ కలెక్షన్స్ ని కేవలం పది రోజుల్లోపు ఈ చిత్రం దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.