https://oktelugu.com/

స్టార్ వారసుడి చిరకాల కోరిక తీరుతుందా ?

తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ఫ్యామిలీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు బాబు. అయితే, విష్ణుకి స్టార్ డమ్ రాలేదు గాని, కాస్త కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడని.. అలాగే వైవిధ్యమైన సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేయగలడు అని మంచి పేరు అయితే వచ్చింది. పైగా ఒకపక్క హీరోగా చేస్తూనే.. మరోపక్క నిర్మాతగానూ వరుసగా సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు విష్ణు. ఎలాగూ కాలేజీలు స్కూల్స్ బిజినెస్ ఉంది. […]

Written By:
  • admin
  • , Updated On : January 6, 2021 / 09:47 AM IST
    Follow us on


    తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ఫ్యామిలీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు బాబు. అయితే, విష్ణుకి స్టార్ డమ్ రాలేదు గాని, కాస్త కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడని.. అలాగే వైవిధ్యమైన సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేయగలడు అని మంచి పేరు అయితే వచ్చింది. పైగా ఒకపక్క హీరోగా చేస్తూనే.. మరోపక్క నిర్మాతగానూ వరుసగా సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు విష్ణు. ఎలాగూ కాలేజీలు స్కూల్స్ బిజినెస్ ఉంది. ఆ మాటకొస్తే స్టార్ కుటుంబాల నుండి వారసులుగా వచ్చిన తెలుగు హీరోలందరిలో కల్లా, మొదటి నుండి మంచి బిజినెస్ మెన్ అనిపించుకున్న ఏకైక హీరో విష్ణు ఒక్కడే.

    Also Read: జాలు వారిన ‘వెన్నెల’కంటి కలం ఆగిపోయింది!

    ఇక తన సినిమాలకు ఎవరేజ్ మార్కెట్ నే ఉన్నా.. ఎప్పుడూ తక్కువ బడ్జెట్ లోనే సినిమాలు చేయాలనే నియమాలను పెట్టుకోకుండా.. ఏదైనా కథను బట్టే చేయాలనే పద్ధతిని ఫాలో అవుతూ ముందుకు పోతున్నాడు. కాకపోతే కెరీర్ లో ఇప్పటివరకూ తనకంటూ ఓ ఇమేజ్ ను సాధించలేకపోవడం విష్ణుకి తీరని కోరికగా మిగిలిపోయిందట. అందుకే రానున్న సినిమాలతో ‘తనకంటూ ఓ ఇమేజ్’ అనే తన చిరకాల కోరికను తీర్చుకోవడానికి పక్కా ప్లాన్డ్ గా ఈ సారి సినిమా చేస్తున్నాడట. ఆ సినిమానే శ్రీను వైట్లతో చేస్తోన్న ‘ఢీ సీక్వెల్’ సినిమా.

    Also Read: ట్రైలర్ టాక్: ‘అల్లుడు అదర్స్’ అన్నీ కలగలిపేశాడే?

    అయితే, ప్లాప్ లతో ఇమేజ్ పోయి.. చివరకు సినిమా సెట్ చేసుకోవడానికి కిందామీదా పడిన శ్రీను వైట్ల, మంచు విష్ణుకి హిట్ ఇవ్వగలడా ? ఇప్పటికే విష్ణు కెరీర్ చాలా వెనుక పడిపోయింది. పాపం ఎంత చేసినా.. ఎన్ని సినిమాలు చేసినా కనీసం సెకెండ్ గ్రేడ్ స్టార్ ల వరుసలో కూడా విష్ణు నిలబడలేకపోతున్నాడు. దానికి తోడు విష్ణుకి సాలిడ్ హిట్ వచ్చి సంవత్సరాలు గడిచిపోయాయి. పైగా సినిమాలను కూడా బాగా తగ్గిస్తూ చేస్తున్నాడు. ఇక చేసిన గత కొన్ని సినిమాలు కూడా ప్లాప్ లు అయ్యాయి. దీనికితోడు బాక్సాపీస్ వద్ద విష్ణు సినిమాలకి పెద్దగా కలెక్షన్స్ కూడా రావడంలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో విష్ణు చిరకాల కోరిక తీరుతుందా ? చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్