https://oktelugu.com/

Rajinikanth: రజినీకాంత్ జైలర్ 2 లో విలన్ పాత్ర కీలకం కానుందా.? ఆ క్యారెక్టర్ లో నటించే స్టార్ హీరో ఎవరో తెలుసా.?

ఒకే టైమ్ లో ఈ రెండు సినిమాలను పూర్తి చేసి ఆ సినిమా మీద ఫోకస్ చేయాలనే ఆలోచనలో రజనీకాంత్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే జైలర్ సినిమాలో విలన్ గా నటించిన వినాయకన్ ఆ సినిమా విజయంలో కీలకపాత్ర వహించాడు.

Written By:
  • Gopi
  • , Updated On : September 24, 2024 / 09:45 AM IST

    Rajinikanth(1)

    Follow us on

    Rajinikanth: రజనీకాంత్ హీరోగా తమిళ్ సినిమా ఇండస్ట్రీని గత 40 సంవత్సరాల నుంచి ఏలుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రత్యేకంగా రజనీకాంత్ నటనకి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అయితే దక్కుతూ ఉంటాయి. ఆయన చేసే ప్రతి సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే నటన పరంగా కూడా స్కోప్ ఉండే విధంగా చూసుకుంటాడు. అందుకే రజనీకాంత్ మాస్ హీరోగా ఎదగడమే కాకుండా నటన పరంగా కూడా చాలా మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే గత సంవత్సరం ఆయన చేసిన జైలర్ సినిమా సూపర్ సక్సెస్ సాధించిందనే చెప్పాలి. ఈ సినిమా దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. మరి మొత్తానికైతే ఈ సినిమాని తీసిన నెల్సన్ మరోసారి రజనీకాంత్ తో ఈ సినిమాకి సీక్వెల్ ను తీసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇంకా ఇప్పటికే ఈ కాంబినేషన్ లో జైలర్ 2 అనే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటికి ఆ సినిమా రెగ్యూలర్ షూటింగ్ లో పాల్గొనడానికి మాత్రం రజనీకాంత్ కాస్త సమయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన వెట్టయాన్, కూలీ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు.

    ఒకే టైమ్ లో ఈ రెండు సినిమాలను పూర్తి చేసి ఆ సినిమా మీద ఫోకస్ చేయాలనే ఆలోచనలో రజనీకాంత్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే జైలర్ సినిమాలో విలన్ గా నటించిన వినాయకన్ ఆ సినిమా విజయంలో కీలకపాత్ర వహించాడు. మరి రజనీకాంత్ కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉందో వినాయకన్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ అయితే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాలో కూడా ఆయన విలన్ గా నటిస్తున్నాడా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    ఇక ఈ సీక్వెల్ లో కూడా విలన్ పాత్ర కోసం ఒక స్టార్ నటుడిని తీసుకోబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఆ విలన్ ఎవరు అనేదానిమీద పలు రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే కొన్ని వార్తలు వినిపిస్తున్నప్పటికీ వాటిలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలైతే తెలియడం లేదు. ఇప్పటికి తెలుగు స్టార్ హీరో అయిన రాజశేఖర్, తమిళ్ స్టార్ హీరో అయిన అరవింద స్వామి ల పేర్లు వినిపిస్తున్నాయి.

    మరి వీరిలో ఎవరు ఈ పాత్రను పోషించబోతున్నారు అనేది దానిమీద ఇంకా క్లారిటీ అయితే రావడం లేదు. అలాగే ఈ సినిమాలో విలన్ ఒక సైకో పాత్రలో కనిపించబోతున్నాడట. మరి ఆ పాత్రకి వీళ్లిద్దరిలో ఎవరు సెట్ అవుతారు. నెల్సన్ ఎవరిని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక ఈ సినిమా 2025 చివర లో రానున్నట్టుగా కూడా తెలుస్తుంది…