https://oktelugu.com/

Chiranjeevi: కమల్ హాసన్ చేయాల్సిన సినిమాను చిరంజీవి చేసి సూపర్ హిట్ కొట్టాడనే విషయం మీకు తెలుసా..?

చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో ఇలాంటి కొన్ని సినిమాలు చేశాడు. అయినప్పటికీ అందులో కొన్ని వర్కౌట్ అయితే మరికొన్ని మాత్రం ఫ్లాప్ గా నిలిచాయి. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి ఇప్పటికి అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నాడు. సినిమా అంటే ఆయనకు పిచ్చి దానికోసం ఏదైనా చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని పలు సందర్భాల్లో చెప్పాడు.

Written By:
  • Gopi
  • , Updated On : September 24, 2024 / 09:41 AM IST

    Chiranjeevi(12)

    Follow us on

    Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మెగాస్టార్ చిరంజీవి గుర్తుకొస్తాడు. ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలు కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను మెప్పిస్తూ రావడం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయమనే చెప్పాలి. ఆయన చేసిన ప్రతి పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. అలాంటి వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలు గా చేసిన చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు మాస్ కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన చిరంజీవి అప్పుడప్పుడు ఆర్ట్ సినిమాలను కూడా చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు. నిజానికి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన తనదైన రీతిలో సినిమాలను చేయడానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు. ఇక ఇలాంటి క్రమం లోనే చిరంజీవి చేసిన ఆరాధన అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా మొదట కమల్ హాసన్ చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల కమలహాసన్ ఈ సినిమాను వదిలేశాడు. దీంతో చిరంజీవి ఆ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక మొదట భారతి రాజా ఈ సినిమాని తమిళం లో సత్యరాజ్ ను హీరోగా పెట్టి ‘కవితోర కవితైగల్’ అనే పేరుతో సినిమా చేశాడు. అక్కడ సూపర్ సక్సెస్ అవడంతో తెలుగులో కమల్ హాసన్ ను పెట్టి రీమేక్ చేయాలనుకున్నాడు.

    కానీ అది కుదరని పక్షంలో చిరంజీవిని పెట్టి ఈ సినిమా తీసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. చిరంజీవికి కూడా నటన పరంగా ఈ సినిమా చాలా మంచి గుర్తింపును తీసుకొచ్చిందనే చెప్పాలి. కొంతమంది చిరంజీవి ని మాస్ హీరోగా చూసి ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో చూడడం వల్ల కొంతవరకు వాళ్లకు ఆ సినిమా నచ్చకపోయిన కూడా సినిమా మంచి విజయాన్ని సాధించి చిరంజీవిలో ఉన్న నటుడిని తెలుగు సినిమా జనానికి పరిచయం చేసిందనే చెప్పాలి…

    ఇక చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో ఇలాంటి కొన్ని సినిమాలు చేశాడు. అయినప్పటికీ అందులో కొన్ని వర్కౌట్ అయితే మరికొన్ని మాత్రం ఫ్లాప్ గా నిలిచాయి. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి ఇప్పటికి అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నాడు. సినిమా అంటే ఆయనకు పిచ్చి దానికోసం ఏదైనా చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇంకొన్ని సందర్భాల్లో ప్రూవ్ చేశాడు కూడా…

    ఇక ఇప్పుడు వశిష్ట డైరెక్షన్ లో చేస్తున్న ‘విశ్వంభర ‘ సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతున్నందువల్ల ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…