Homeజాతీయ వార్తలుMonkeypox: మంకీపాక్స్‌ డేంజర్‌ బెల్స్‌.. భారత్‌లో కొత్తగా మరో కేసు..తొలి క్లాడ్‌ 1బీ కేసు...

Monkeypox: మంకీపాక్స్‌ డేంజర్‌ బెల్స్‌.. భారత్‌లో కొత్తగా మరో కేసు..తొలి క్లాడ్‌ 1బీ కేసు…

Monkeypox: ఆఫ్రికాలో పుట్టిన మంకీపాక్స్‌.. క్రమంగా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. మొన్నటి వరకు మన దేశానికి రాదు అనుకున్నారు. అయినా అనుమానితులను గుర్తించేందుకు విదేశాల నుంచి వచ్చే వారికి టెస్ట్, ట్రేస్, ట్రీట్ విధానం ప్రారంభించారు. కట్టడి చర్యలు చేపట్టారు. కానీ, భయపడ్డట్లే జరిగింది. మంకీపాక్స్‌ మన దేశంలోకి వచ్చేసింది. చాపకింద నీరులా కోరలు చాస్తోంది. ఇప్పటికే రెండు కేసులు నమోదు అయినట్లు గుర్తించి వారికి చికిత్స చేస్తున్నారు. తాజాగా మరో కేసు నమోదైంది. దుబాయ్‌ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి ఎంపాక్స్‌ లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

తొలి క్లేడ్‌–1బీ కేసు..
దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి అనుమానంతో టెస్టులు చేయగా ఎంపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మంకీపాక్స్‌ క్లేడ్‌–1బీ వైరస్‌గా నిర్ధారించారు. ఇప్పటికే ప్రపంచ దేశాలను ఎంపాక్స్‌ భయపెడుతుండగా, భారత్‌లో కేసులు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. కొత్తగా కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చేవారిలో ఎవరికైనా ఎంపాక్స్‌ లక్షణాలు ఉంటే.. వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించింది. ఇదిలా ఉంటే.. మన దేశంలో తొలి కేసు సెప్టెంబర్‌ 9న, రెండో కేసు సెప్టెంబర్‌ 18న, మూడో కేసు సెప్టెంబర్‌ 23న నిర్ధారణ అయింది. మూడు కేసుల్లో రెండు కేసులు కేరళలోనే ఉన్నాయి. మలప్పురం వాసి ఇటీవల దుబాయ్‌ నుంచి రాగా, అతడికి ఎంపాక్స్‌ నిర్ధారణ అయింది. మొదటి కేసు ఢిల్లీలో నమోదైంది. అతడిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.

ఇలా సోకుతుంది..
మంకీపాక్స్‌ ఇన్‌పెక్షన్‌ సాధారణంగా 2 నుంచి 4 వారాలు ఉంటుంది. సపోర్టివ్‌ మేనేజ్‌మెంట్‌తో రోగులు కోలుకుంటున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. అలైంగిక సంపర్కం, గాయపడిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం లేదా సోకిన వ్యక్తి దుస్తులు లేదా బెడ్‌షీట్‌లను ఉపయోగించడం వలన వ్యాధి సోకే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఎంపాక్స్‌ ఇన్‌ఫెక్షన్‌ మనిషిలో 2 నుంచి 4 వారాలు ఉంటుంది. రోగికి సపోర్టివ్‌ మేనేజ్‌మెంట్‌ చికిత్స చేయడం ద్వారా కోలుకుంటున్నారు. వైరస్‌ ప్రధానంగా అలైంగిక సంపర్కం, గాయపడిన వ్యక్తితో కలిసి ఉండడం, వైరస్‌ సోనిన వ్యక్తి దుస్తులు, బెడ్‌షీట్‌లు వాడడం ద్వానా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. చాలావరకు దానంతటదే తగ్గుతుంది. కానీ, కొందరిలో మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఇప్పటి వరకు వ్యాధికి వ్యాక్సిన్‌ గానీ, మందులుగానీ, లేవ. లక్షణాల ఆధారంగానే వైద్యులు చికిత్స చేస్తున్నారు. యాంటీ వైరల్‌ మందులు ఇస్తున్నారు.

లక్షకుపైగా కేసులు..
ఇదిలా ఉంటే ఆప్రికాలో ఎంపాక్స్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంపాక్స్‌ కేసులు లక్ష దాటాయని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. రెండేళ్లుగా వైరస్‌ వ్యాపిస్తోందని తెలిపింది. ఇక దేశంలో మొదట గుర్తించిన వ్యక్తికి వెస్ట్‌ ఆఫ్రికన్‌ క్లాడ్‌ 2 వైరస్‌గా గుర్తించారు. తాజాగా నమోదైన కేసు క్లాడ్‌ –1బీగా నిర్ధారణ అయింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version