https://oktelugu.com/

Pushpa 2 Movie : పుష్ప 2 : ది రూల్’ విడుదల వాయిదా పడనుందా..? వచ్చే వారం సంచలన అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్!

ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా, అప్పుడే 1 మిలియన్ డాలర్ మార్కుని దాటేసింది. చూస్తుంటే కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి 3 మిలియన్ కి పైగా డాలర్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా డిసెంబర్ 5 వ తారీఖున వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్. ఎందుకంటే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : November 22, 2024 3:15 pm
    Pushpa 2 Movie

    Pushpa 2 Movie

    Follow us on

    Pushpa 2 Movie :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇటీవలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి యూట్యూబ్ లో 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమాపై ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా, అప్పుడే 1 మిలియన్ డాలర్ మార్కుని దాటేసింది. చూస్తుంటే కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి 3 మిలియన్ కి పైగా డాలర్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా డిసెంబర్ 5 వ తారీఖున వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్. ఎందుకంటే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.

    ఇటీవలే హైదరాబాద్ లో ఒక ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ప్రస్తుతం ఒక పాటని తెరకెక్కిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ నుండి తప్పించి, థమన్ ని తీసుకున్నారు. థమన్ రీసెంట్ గానే ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొత్తాన్ని పూర్తి చేసి సుకుమార్ కి చూపించాడు. కానీ సుకుమార్ ఎందుకో ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. దీంతో మళ్ళీ రీ వర్క్ చేయించుకున్నాడు. ఎట్టకేలకు ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రీ రికార్డింగ్ వర్క్ పూర్తి అవ్వడంతో కంటెంట్ ని ఐమాక్స్ ఫార్మటు లోకి మార్చడానికి పంపేశారు. ఇప్పుడు సెకండ్ హాఫ్ కి సంబంధించిన వర్క్ చాలా బ్యాలన్స్ ఉంది.

    VFX డిపార్ట్మెంట్ నుండి రావాల్సిన షాట్స్ చాలా బ్యాలన్స్ ఉంది. అదే విధంగా రీసెంట్ గా షూట్ చేసిన ఫైట్ సన్నివేశాన్ని కూడా జత చేయాల్సి ఉంది. ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉంది. సినిమా విడుదలకు సరిగ్గా 13 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంతలోపు ఇవన్నీ పూర్తి అయ్యి, కనీసం మొదటి కాపీ అయినా సిద్ధం అవుతుందా అని మేకర్స్ అనుమానిస్తున్నారు. అదే విధంగా సెకండ్ హాఫ్ కి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ నిన్ననే మొదలు పెట్టారట. ఈ పని పూర్తి అవ్వడానికి వారం రోజుల సమయం పడుతుంది. కేవలం పూర్తి అవ్వడం మాత్రమే కాదు, అది సుకుమార్ కి నచ్చాలి. లేదంటే మళ్ళీ రీ వర్క్ చేయాలి. కాబట్టి వీటికి సమయం బాగా పట్టే అవకాశం ఉన్నందున ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 వ తారీఖున విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. దీనిపై స్పష్టత వచ్చే వారం లో నిర్మాతలు ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ వాయిదా పడితే మాత్రం ఓవర్సీస్ లో ఈ సినిమాకి భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది.