Malayalam Industry : మలయాళంలో కూడా వారసుల హవానే కొనసాగుతుందా..? అన్ని ఇండస్ట్రీల్లో నెపోటిజం ఉందా..?

సినిమా ఇండస్ట్రీ అనగానే మనందరికీ స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్లను చూసే ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వస్తారు. కాబట్టి వాళ్ళ మీద భారీ బడ్జెట్ ని పెట్టడానికి ప్రొడ్యూసర్స్ వెనకాడరు. దానివల్ల సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రొడ్యూసర్స్ కి కూడా భారీ లాభాలను తీసుకొచ్చి పెడుతుంటాయి...

Written By: NARESH, Updated On : October 27, 2024 6:41 pm

Will the air of heirs continue in Malayalam too

Follow us on

Malayalam Industry : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా పేరుగాంచిన నటులు వాళ్ల వాళ్ల ప్రస్థానం ముగించుకునే సమయానికి తమ వారసులను రంగులోకి దింపుతుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ నట వారసత్వంతో ఉన్నవాళ్లే కావడం విశేషం… నిజానికి తెలుగులోనే కాదు ప్రతి సినిమా ఇండస్ట్రీలో నట వారసుల హవా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో దుల్కర్ సల్మాన్ లాంటి హీరో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న వైనం మనం గమనిస్తూనే ఉన్నాం. మమ్ముట్టి లాంటి స్టార్ హీరో కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ చాలా తక్కువ సమయంలోనే తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక మలయాళం లోనే కాకుండా ఆయన వివిధ భాషల్లో కూడా సినిమాలను చేస్తూ ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు తన అభిమానిగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే మలయాళం సినిమా ఇండస్ట్రీలో మరొక స్టార్ హీరోగా ఎదిగిన మోహన్ లాల్ కూడా తన కొడుకు అయిన ప్రణవ్ మోహన్ లాల్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు. ఇక తనదైన రీతిలో మలయాళం లో సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకు పెద్దగా సక్సెస్ లు అయితే దక్కడం లేదు. నిజానికి మమ్ముట్టి, మోహన్ లాల్ ఇద్దరు ఎలాగైతే ఒకప్పుడు భారీ సక్సెస్ లను సాధించారో ఇప్పుడు వాళ్ళ కొడుకులు కూడా ఇండస్ట్రీని ఏలాలనే ఉద్దేశ్యంతోనే వాళ్ళను రంగంలోకి దింపారు.

కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం భారతీయ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తుంటే ప్రణవ్ మాత్రం కేవలం మలయాళ ఇండస్ట్రీకే పరిమితమయ్యాడు. ఇక రానురాను రోజుల్లో తను కూడా మిగతా భాషల్లో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. నిజానికి దుల్కర్ సల్మాన్ తో పోలిస్తే ప్రణవ్ చాలా చిన్నవాడు. అందువల్లే ఆయన ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాడు.

కాబట్టి మలయాళంలో తన స్టెబిలిటీని చూపించిన తర్వాత మిగతా భాషల్లో పట్టు సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే తెలుగులో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీయార్, మహేష్ బాబు ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు నెపోటిజంతో వచ్చిన వాళ్లే కావడం విశేషం…ఇక ఇప్పుడు ఇండస్ట్రీ లో వీళ్లే టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు….

ఇక తెలుగులోనే కాదు అన్ని ఇండస్ట్రీ ల్లో వారసులే చక్రం తిప్పుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మలయాళం నుంచి వచ్చిన దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి, సీతారామం లాంటి సినిమాలను చేశాడు. ఇక ఈ సినిమాలతో ఇక్కడ కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక మొత్తానికైతే తెలుగులో కూడా నట వారసుల హవానే కొనసాగుతుండటం విశేషం…