Shankar: ఒకప్పుడు తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు శంకర్…ప్రేక్షకుడు సినిమా చూసే విధానాన్నే మార్చేసిన శంకర్ తనదైన రీతిలో లంచం, అవినీతి పైన పోరాటం చేస్తూ చేసిన సినిమాలు ఇప్పటికి ఒక క్లాసికల్ సినిమాలు గానే మిగిలిపోయాయి. ఒకప్పుడు ఫెయిల్యూర్ అనేది తెలియని శంకర్ ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే జనవరి 10వ తేదీన రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సంవత్సరం వచ్చిన ‘భారతీయుడు 2’ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఇక ఇప్పుడున్న దర్శకులతో పోలిస్తే ఆయన చాలా వరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి. నిజానికి ఆయన చేసిన విజువల్ వండర్స్ ని ఇప్పటివరకు ఏ దర్శకుడు కూడా క్రియేట్ చేయలేకపోయాడు. కానీ ప్రస్తుతం ఆయనకు బ్యాడ్ టైమ్ నడుస్తున్న సమయంలో వచ్చిన సినిమా వచ్చినట్టు ఫ్లాప్ అవుతుంది. దాంతో గేమ్ చేంజర్ సినిమా మీద చాలా స్పెషల్ కేర్ తీసుకున్న ఆయన ఇప్పుడు ఆ మూవీని సక్సెస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక దానికి తోడుగా ప్రస్తుతం రామ్ చరణ్ మీదే పూర్తి బాధ్యతని వదిలేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన స్టార్ డమ్ ను చూసి తెలుగులో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టబోతుంది.
కాబట్టి కొంచెం ఈ సినిమా యావరేజ్ గా ఉందని తెలిసినా కూడా సూపర్ సక్సెస్ సాధించి భారీ కలెక్షన్స్ రావడం పక్కా అంటూ సినిమా మేకర్స్ వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక ఇప్పటికే దిల్ రాజు ఈ సినిమా మీద భారీగా ఖర్చు పెట్టాడు. మరి ఆ ఖర్చు మొత్తాన్ని రికవరీ చేయాలంటే మాత్రం సినిమా అదిరిపోవాలి.
ఇక రిలీజ్ చేసే ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానివల్లనే ప్రేక్షకుల మీద చాలావరకు ఇంపాక్ట్ క్రియేట్ అయి ప్రేక్షకుల్లో సినిమా చూడాలనే విధంగా బజ్ అయితే క్రియేట్ అవుతుంది…అందుకే ఈ సినిమాను భారీ లెవెల్లో రిలీజ్ చేయడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద దాదాపు 500 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించిన దిల్ రాజు ఈ సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్స్ వస్తేనే ఆయన సేఫ్ జోన్ లో ఉంటాడు. లేకపోతే మాత్రం కొంతవరకు అతనికి నష్టాలు మిగిల్చే ప్రమాదం కూడా ఉందని సినిమా పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…