OG Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం ఓజీ సినిమాను సెట్స్ మీద ఉంచిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా దర్శకుడు అయిన సుజీత్ తనదైన రీతిలో ఈ సినిమాని తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని రిలీజ్ చేశాడు. ఇక అందులో ఒక ఎస్సై తన తల లేకుండా కేవలం మొండెంతోనే చేర్లో కూర్చున్న ఒక స్టిల్ అయితే అనఫిషియల్ గా రిలీజ్ చేశారు. మరి ఆ స్టిల్ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు వస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఆ తలని నరికింది పవన్ కళ్యాణ్ అని సినిమా యూనిట్ నుంచి కొన్ని అధికారిక వార్తలైతే వస్తున్నాయి. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్ ఇస్తే మాత్రం ఆ సినిమా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉండబోతుందనే విషయం మనందరికీ తెలిసిందే.
ఇక ఈ సినిమాలో కూడా ఆయన అలాంటి ఒక ఎలివేషన్ రాసుకొని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ పిక్ ని ఆయన రిలీజ్ చేశాడా లేదంటే ఆయనకు తెలియకుండా రిలీజ్ అయిందా అనే విషయం తెలీదు కానీ మొత్తానికైతే ఈ పిక్ ఆ సినిమాలోనిదే అంటూ క్లారిటీ అయితే వచ్చింది…
మొత్తానికైతే తనదైన రీతిలో సత్తాను చాటుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అటు పాలిటిక్స్ లోను , ఇటు సినిమాల్లోనూ బిజీగా ముందుకు సాగుతున్నాడు. ఇక యంగ్ డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్న సుజీత్ ఈ సినిమాతో మరొకసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని సాధిస్తే ఆయన మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న వాడు అవుతాడు.
ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్క అంటూ తన అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి ఎలివేషన్స్ ని ఇస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులను ఆనందపరుస్తాడు అనేది… ఇక మొత్తానికైతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా కొనసాగుతున్నాడు. కాబట్టి ఈ సినిమాల మీద తను డేట్స్ ఎప్పుడు కేటాయించబోతున్నాడనేది ప్రేక్షకులందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.