Sankranti : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ (Music Director) గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ‘తమన్ ‘(thaman)… ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన మ్యూజిక్ అందించిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఆయనకు గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన సంక్రాంతి విన్నర్ గా నిలుస్తూ వస్తున్నాడు. ఆయన మ్యూజిక్ అందించిన ప్రతి సంక్రాంతి సినిమా హిట్ అవుతూనే ఉండడం విశేషం. ఇక 2011వ సంవత్సరంలో రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘మిరపకాయ్ ‘ సినిమాతో సంక్రాంతి విజయాన్ని అందుకున్న ఆయన ఆ తర్వాత సంవత్సరంలో ‘బిజినెస్ మేన్’ , ‘బాడీ గార్డ్’ రెండు సినిమాలు ఏకకాలంలో సంక్రాంతికి రిలీజ్ అవ్వడం ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడంతో సంక్రాంతి సీజన్ తమన్ కి బాగా కలిసి వస్తుంది అంటూ చాలామంది ప్రొడ్యూసర్లు దర్శకులు అతన్ని తమ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక 2013 వ సంవత్సరంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘నాయక్’ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఆ తర్వాత 2016వ సంవత్సరంలో బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘డిక్టేటర్ ‘ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది… ఇక 2020వ సంవత్సరంలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘అలా వైకుంఠపురంలో’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా విన్నర్ గా నిలిచింది. ఇక నాన్ బాహుబలి రికార్డులను కూడా క్రియేట్ చేయడం విశేషం…ఇక ఆ తర్వాత 2021 వ సంవత్సరానికి గాను క్రాక్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించి సంక్రాంతి విన్నర్ గా నిలిపాడు…
ఇక 2023 వ సంవత్సరంలో బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని సంక్రాంతికి తమన్ వచ్చాడు అంటే ఇక తిరుగు ఉండదనెంతలా పేరు ప్రఖ్యాతలనైతే సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ సినిమాతో సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు.
మరి ఈ సినిమాలతో తన సక్సెస్ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తాడా? లేదంటే తన సక్సెస్ సీక్రెట్ కి బ్రేక్ ఇస్తాడా?అనేది తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా గేమ్ చేంజర్ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని శంకర్ మంచి నమ్మకాన్ని పెట్టుకున్నాడు…
డాకు మహారాజు సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి ఇక బాబి ఈ సినిమాని స్టేట్ మెంట్ తో తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ప్రతి షాట్ కూడా చాలా ఎక్స్ట్రాడినర్ గా ఉండబోతున్నట్టుగా ట్రైలర్ చూస్తే మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది…