Telangana Voters List: ఎన్నిలక సమయంలో ఓటరు సమోదు, ఓటరు జాబితా రూపొందించి ఆయా గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాల వారీగా విడుదల చేస్తుంది. అయితే ఏటా దేశవ్యాప్తంగా ఎన్నికలతో సంబంధం లేకుండా ఓటరు జాబితా ప్రకటిస్తుంది. ఇందులో మార్పులు చేర్పులు, కొత్త ఓటరు నమోదు చేసి తుది జాబితా సిద్ధం చేస్తుంది. 2025, జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండే వారితోపాటు మార్పులు చేర్పులు, తొలగింపుల తర్వాత కొత్త జాబితాను జనవరి 6న విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 4,14,40,447 మంది ఓటర్లు, తెలంగాణలో 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. ఏపీలో కొత్తగా 5.14 లక్షల మంది ఓటరుగా చేరగా తెలంగాణలో 2.19 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. ఈ జాబితా ప్రకారమే వచ్చే ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఏడాది జరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచింది. దీనికి కావాల్సింది ఓటర్ల వ్యక్తిగత ఎపిక్ నంబర్. ఓటర్లందరికీ భారత ఎన్నిక సంఘం ఎలక్టోర్స్ ఫొటో గుర్తింపు కార్డు లేదా ఎపిక్ నంబర్ జారీ చేస్తుంది. దీనిద్వారా మనం సింపుల్‌గా ఓటరు లిస్టులో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా తెలుసుకోవచ్చు. మరో విధానం ఎన్నికల సంఘం టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
ఎస్‌ఎంఎస్ ద్వారా ఇలా..
మొదట ఫోన్ నుంచి టెక్ట్స్ మెసేస్ పంపాలి. ముందుగా ఓపిక్ ఓటర్ ఐడీ నంబర్ నోట్ చేసుకుని పెట్టుకోవాలి. «1950 నంబర్‌కు ఎపిక్ ఓటర్ ఐడీ నంబర్‌ను ఎస్‌ఎంఎస్ చేయాలి. తర్వాత మీ ఫోన్ నంబర్‌కు మెస్సేజ్ వస్తుంది. అందులో మీ పోలింగ్ బూత్ నంబర్, పేరు ఉంటాయి. ఒకవేళ ఓటరు జాబితాలో పేరు లేకుంటే మెస్సేజ్ రాదు.
హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా…
ఇక ఓటరు జాబితాలో పేరు తనిఖీ చేయడానికి మీరు భారత ఎన్నికల సంఘం టోల్‌ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. దీనికన్నా ముందు ఎపిక్ ఐడీ నంబర్ అందుబాటులో ఉంచుకోవాలి. అనంతరం 1950 నంబర్‌కు ఫోన్ చేసి ఆ తర్వాత ఇంటరాక్ట్ వాయిస్ రెస్పాన్స్ ప్రకారం మీకు నచ్చిన భాష ఎంచుకోవాలి. తర్వాత ప్రాంప్ట్ కాల్‌ను అనుసరించి ఓటర్ ఐడీ స్టేటస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ మన ఎపిక్ ఓటర్ ఐడీ నంబర్ ఇవ్వాలి. తర్వాత మీ ఐడీ స్టేటస్ తెలుస్తుంది.