https://oktelugu.com/

Realme 14 Pro 5G : త్వరలోనే మార్కెట్లోకి రంగులు మార్చే ఫోన్.. ధర, ఫీచర్లు ఏంటో తెలుసా ?

Realme 14 Pro సిరీస్ నార్డిక్ డిజైన్‌తో కలిసి డెవలప్ చేసిన మొదటి కోల్డ్-సెన్సిటివ్ కలర్ ఛేంజింగ్ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. అంటే వాతావరణం మారుతున్న కొద్దీ ఈ ఫోన్ రంగు కూడా మారుతుంది. చల్లని వాతావరణంలో ఫోన్ రంగు మారుతుంది.

Written By:
  • Rocky
  • , Updated On : January 7, 2025 / 12:42 PM IST

    Realme 14 Pro 5G

    Follow us on

    Realme 14 Pro 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మీ 2025 సంవత్సరంలో తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి రెడీగా ఉంది. రియల్‌మే 14 ప్రో సిరీస్‌గా పిలువబడే కొత్త సిరీస్‌ను భారతదేశంలో ప్రారంభించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ సిరీస్ జనవరి 16న ప్రారంభించబడుతుంది. ఈ సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు కంపెనీ ఈ సిరీస్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

    రంగు మార్చే స్మార్ట్‌ఫోన్
    Realme 14 Pro సిరీస్ నార్డిక్ డిజైన్‌తో కలిసి డెవలప్ చేసిన మొదటి కోల్డ్-సెన్సిటివ్ కలర్ ఛేంజింగ్ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. అంటే వాతావరణం మారుతున్న కొద్దీ ఈ ఫోన్ రంగు కూడా మారుతుంది. చల్లని వాతావరణంలో ఫోన్ రంగు మారుతుంది.

    Realme 14 Pro 5G సిరీస్ వేరియంట్లు
    Realme 14 Pro సిరీస్ Realme 14 Pro, Realme 14 Pro Plus అనే రెండు వేరియంట్‌లలో ప్రారంభించబడుతుంది. ఈ సిరీస్ పెర్ల్ వైట్,స్వెడ్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేయబడుతుంది. భారతదేశం ప్రత్యేక వేరియంట్‌లు బికనెర్ పర్పుల్ , జైపూర్ పింక్. ఈ స్మార్ట్‌ఫోన్ Realme అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

    Realme 14 Pro 5G సిరీస్ ఫీచర్లు
    ఫోన్ 1.5K రిజల్యూషన్, అల్ట్రా-తిన్ 1.6 mm బెజెల్‌తో క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియల్ కెమెరా సెటప్ అందించబడుతుంది. తక్కువ వెలుతురులో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ ఫ్లాష్ కెమెరా సిస్టమ్‌తో ఫోన్ అందించబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) , 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

    అధిక రిజల్యూషన్ సెల్ఫీల కోసం ఫోన్‌లో 32MP ఫ్రంట్ కెమెరా అందించబడుతుంది. పెరల్ వైట్ వేరియంట్‌లో కోల్డ్ సెన్సిటివ్ కలర్-ఛేంజ్ టెక్నాలజీ అందించబడుతుంది. ఫోన్‌కు ఎనర్జీ ఇవ్వడం కోసం 6000 mAh పవర్ ఫుల్ బ్యాటరీ అందించబడుతుంది.