https://oktelugu.com/

Lavanya Varun Tej: వరుణ్ తేజ్, లావణ్య మళ్లీ కలిసి ఆ పనిచేస్తున్నారా?

మిస్ పర్ఫెక్ట్ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్టొంటున్న ఈ అమ్మడుకు పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించిన వరుణ్, లావణ్యలు తిరిగి మళ్లీ కలిసి నటిస్తారా అనే ప్రశ్న ఎదురైంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 25, 2024 / 02:26 PM IST
    Follow us on

    Lavanya Varun Tej: సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తనదైన ముద్ర వేసుకుంది. ఒక్క సినిమాతో మంచి పేరు సంపాదించి ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది లావణ్య. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు మెగా ఇంటి వారసుడు వరుణ్ తేజ్ తో ప్రేమలో పడింది. మిస్టర్,అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట ముందుగా స్నేహం చేశారు. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా చిగురించింది.

    వీరి ప్రేమ వార్తలు సోషల్ మీడియాలో ఎన్నో సార్లు వచ్చిన పెదవి విప్పలేదు. కానీ సడన్ గా నిశ్చితార్థం వార్తతో అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ తర్వాత అంగరంగ వైభవంగా ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. గత సంవత్సరం జూన్ లోనే వీరి నిశ్చితార్థం జరిగితే నవంబర్ 1న పెళ్లి జరిగింది. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత లావణ్య నటిస్తోన్న మొదటి వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ఈ సిరీస్ తెలుగు హిందీ భాషల్లో వచ్చే నెల 2నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ త్వరలోనే విడుదలకు సిద్దం అవుతుండడంతో ప్రమోషన్ లతో బిజీ అవుతుంది లావణ్య.

    మిస్ పర్ఫెక్ట్ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్టొంటున్న ఈ అమ్మడుకు పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించిన వరుణ్, లావణ్యలు తిరిగి మళ్లీ కలిసి నటిస్తారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి బదులుగా ఒక మంచి కథ ఉంటే కచ్చితంగా కలిసి నటిస్తామని తెలిపింది సొట్ట బుగ్గల సుందరి. కానీ అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ అప్పటి వరకు మాత్రం ఎదురుచూడాల్సిందే అని తెలిపింది. అంతే కాదు ఈ ప్రమోషన్ లలో భాగంగా వరుణ్ గురించి కూడా మాట్లాడింది.

    వరుణ్ మంచి లైఫ్ పార్టనర్ అని.. ఎన్నో విషయాల్లో ప్రోత్సహిస్తారని, తను చాలా విషయాల్లో పర్ఫెక్ట్ అంటూ తెలిపింది. ఇక మెగా కోడలిగా ఉండడం చాలా స్పెషల్ అని కొనియాడింది. అంతే కాదు ఇటు నటన విషయంలో తల్లితండ్రి కానీ మెగా ఫ్యామిలీ కానీ ఎలాంటి పరిమితులు పెట్టలేదని.. కానీ తనకు సినిమాల ఎంపికలో కొన్ని లిమిట్స్ ఉన్నాయంటూ తెలిపింది లావణ్య.