Dunki Movie: షారూఖ్ ‘డంకీ’ సినిమాకు ఇది టెస్టింగ్ టైమ్?

షారూఖ్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించడంతో పాటు రూ.వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాయి. రెండు ఘన విజయాలను అందుకున్న తరువాత చేసిన మరో చిత్రమే డంకీ.

Written By: Neelambaram, Updated On : December 14, 2023 3:06 pm
Follow us on

Dunki Movie: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘డంకీ’. దర్శకధీరుడు రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, తాప్సీ వంటి నటులు ప్రధాన పాత్రలను పోషించారు. షారూఖ్ ఖాన్ వాయిస్ తో ప్రారంభం అయిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను భారీగా పెంచేసింది. కాగా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధం అయింది.

ఇంగ్లీష్ నేర్చుకొని యూకే వెళ్లాలని కలలుకనే గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడి పాత్రలో షారూఖ్ నటించారు. ఇంగ్లీష్ నేర్చుకోలేకపోవడంతో ఆఖరికి అక్రమంగా విదేశంలోకి వెళ్లాలని ప్రయత్నించడం, అందులో భాగంగా దొరికిపోవడం ఈ క్రమంలో ఆ వ్యక్తి, అతని స్నేహితులు ఎదుర్కొన్న ఇబ్బందులను మూవీలో చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఏ విధంగా ఆలరిస్తుందోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

షారూఖ్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించడంతో పాటు రూ.వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాయి. రెండు ఘన విజయాలను అందుకున్న తరువాత చేసిన మరో చిత్రమే డంకీ. రెండు బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత వస్తున్న చిత్రం కావడంతో పాటు ప్రభాస్ నటించిన సలార్ సినిమా కూడా పోటీగా నిలవనుంది. ఈ నేపథ్యంలో డంకీ సినిమాకు ఇది కష్టకాలమేనని తెలుస్తోంది.

ఇప్పటికే డంకీ డ్రాప్ -1, డ్రాప్-2, డ్రాప్ -3, డ్రాప్ -4 అంటూ కీలక అప్ డేట్స్ వచ్చాయి. మంచి రెస్పాన్స్ తో పాటు ప్రేక్షకులు, అభిమానుల అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే అదే సమయంలో వస్తున్న సలార్ పోటీగా నిలుస్తున్న నేపథ్యంలో చిత్రబృందంతో పాటు షారూఖ్ అభిమానుల్లో కాస్త అలజడి చెలరేగుతుందని చెప్పుకోవచ్చు. అయితే విడుదలకు ఇంకా వారం మాత్రమే సమయం ఉండటంతో టెన్షన్ మరింత పెరుగుతోంది. అయితే డంకీ ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవుతుందా? లేదా ?అన్నది తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.