Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 టైటల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ -7 కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్ కూడా చివరి దశకు చేరుకోవడంతో అభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈనెల 17న సీజన్ కు సంబంధించిన గ్రాండ్ ఫినాలే జరగనుంది.
అయితే ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనున్న నేపథ్యంలో ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ, ప్రిన్స్ యావర్ మరియు అర్జున్, ప్రియాంకలు ఉన్నారు. ఓటింగ్ కు మరికొంత సమయం ఉండటంతో ఫలితాలు ఏవిధంగా వస్తాయనేది ఇప్పుడే చెప్పడం కాస్తా కష్టతరమేనని చెప్పుకోవచ్చు.
కొందరు ప్రేక్షకుల అభిప్రాయాల మేరకు అర్జున్ , ప్రియాంకలు డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎలిమినేషన్ ఉంటే వీరిలో ఒకరు బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. మరోవైపు సీజన్ -7 లో టాప్ 5 కంటెస్టెంట్స్ గా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్ తో పాటు అర్జున్ కానీ ప్రియాంక కానీ ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి నాగార్జున చెబుతున్నట్లుగా అంతా ఉల్టా పుల్టాగానే నడిచిందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఈసారి ఓటింగ్ లోనూ కీలక మార్పులు జరిగాయి. గతంలో ప్రేక్షకులు, అభిమానులు తమకు ఇచ్చిన పది ఓట్లను ఒక కంటెస్టెంట్ కు మాత్రమే కాకుండా నచ్చిన వారందరీకి వేసే వెసులుబాటు ఉండేది. అదేవిధంగా పది మిస్డ్ కాల్స్ తో నచ్చిన విధంగా ఓటు వేసే ఛాన్స్ ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని మారుస్తూ ఒక ప్రేక్షకుడు ఒక్క ఓటు మాత్రమే వేసే ఛాన్స్ ఇచ్చింది బిగ్ బాస్.. హౌస్ లో నచ్చిన ఒక్క కంటెస్టెంట్ మాత్రమే ఓటు వేయాలి.. అది కూడా హాట్ స్టార్ యాప్ నుంచి మాత్రమేనని పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే మిస్డ్ కాల్ కూడా ఒకటి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.
ఓటింగ్ విధానం మారడంతో పాటు మొదటి నుంచి బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే టాప్ – 5 కంటెస్టెంట్స్ గా ఎవరు ఉంటారు..? వీరిలో విన్నర్, రన్నర్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.. అయితే ఈ సీజన్ లో విజేతగా నిలిచిన వారికి రూ.50 లక్షల నగదుతో పాటు బ్రేజా కార్, జాయ్ అలుక్కాస్ నుంచి రూ.15 లక్షలు అందుతాయని సమాచారం.