Samantha Yashoda: కొన్నాళ్లు హీరోయిన్ పాత్రలకు గుడ్ బై చెప్పిన సమంత హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తోంది. ఇలాంటి కోవలో ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోధ’. శుక్రవారం థియేటర్లోకి వచ్చి ‘యశోధ’పై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు పోటీ సినిమా లేదు. ఓ ఇంగ్లీష్ సినిమా తప్ప మరో మూవీని రిలీజ్ చేయలేదు. గత శుక్రవారం విడుదలైన ‘ఊర్వశివో .. రాక్షాసివో’ మాత్రం సందడి చేస్తోంది. ఆ సినిమా మొదటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా చూసేవారు పెరుగుతున్నారు. కానీ అనుకున్న రికార్డు కలెక్షన్లు మాత్రం రావడం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీ ‘యశోధ’ను ఆసక్తిగా గమనిస్తోంది. ఈ సినిమా ఎలాంటి వసూళ్లు వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల సమంత పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఆమె ‘మయోసిటీస్’ తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. ఇటీవలే హాస్పిటల్ నుంచి ఇంటికి చేరింది. అయితే ‘మయోసిటీస్’తో బాధపడినా ఓ వైపు ట్రట్మెంట్ తీసుకుంటూనే ‘యశోధ’ కోసం పనిచేసి అందరి చేత ప్రశంసలు పొందారు. దీంతో సమంత పడిన కష్టానికి ఫలితం ఉంటుందని సినీ బృందం ఆశిస్తోంది. అయితే ఆసుపత్రిలో ‘మయోసిటీస్’ తో పోరాడిన ఆమె ఇప్పుడు బాక్సాపీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు కొల్లగొడుతుందోనని ఎదురుచూస్తున్నారు.
హరి-హరీష్ అనే ఇద్దరు తమిళ డైరెక్టర్లు కలిసి ఈ సినిమాను తీశారు. శివలెంక ప్రసాద్ దీనిని నిర్మించారు. అయితే ఇప్పటికే ‘యశోధ’కు రూ.24 కోట్ల బిజినెస్ అయినట్లు టాక్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్పెక్టేషన్ బాగానే ఉన్నాయి. స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటి వరకు చేస్తున్న సినిమాలు ఎంతో కొంత రాబట్టాయి. అందుకే ఆమె ఓన్ గా ఇప్పుడు పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమంత ప్రధానంగా వచ్చిన ‘ఓ బేబీ’ తదితర సినిమాలు ఎలాంటి నష్టాన్ని చేకూర్చలేదు. రికార్డులు బద్దలు కొట్టకున్నా యావరేజ్ వసూళ్లు సాధించాయి.

‘యశోధ’కు ట్రైలర్ పై చాలా మంది ప్రేక్షకులు ఎమోషన్ అయ్యారు. ఆ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. మరోవైపు సమంతకు వచ్చిన వ్యాధితో ఆమెపై సింపతీ మరీ పెరిగింది. ఈ సినిమా ప్రారంభానికి ముందే ‘మయోసిటీస్’తో బాధపడుతున్నట్లు నిర్మాత తెలిపారు. అంటే సమంతను చూసేందుకు ఆమె ఫ్యాన్స్ థియేటర్లోకి వస్తారని అనుకుంటున్నారు. ఒకవేళ థియేటర్ బిజినెస్ కాకపోయినా ఓటీటీలో కచ్చితంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు.