Mythri Movie Makers- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క క్రియాశీలిక రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు..కాసేపు షూటింగ్ సెట్స్ లో..కాసేపు రాజకీయ పర్యటనలో అతి కష్టతరమైన రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు..ప్రస్తుతం ఆయన క్రిష్ తో ‘హరి హర వీరమల్లు’ అనే భారీ బడ్జెట్ పీరియడ్ మూవీ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.

ఇంటర్వెల్ కి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను పవన్ కళ్యాణ్ పై ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు..ఈ షెడ్యూల్ కోసం సుమారు పది కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు..ఈ సినిమా షూటింగ్ ఎలా అయినా డిసెంబర్ ఎండింగ్ లోపు పూర్తి చెయ్యాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్..ఆ తర్వాత హరీష్ శంకర్ తో ఒప్పుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ ని ప్రారంభిస్తాడు..అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన లేటెస్ట్ వార్త ఒకటి ఇప్పుడు అభిమానులను కలవరపెడుతుంది.
‘హరి హర వీరమల్లు’ చిత్రం పవన్ కళ్యాణ్ అనుకున్న విధంగా డిసెంబర్ లో పూర్తి అయ్యే అవకాశాలు లేవని..మరో రెండు నెలల సమయం ఎక్కువ అవసరం అవుతుందని డైరెక్టర్ క్రిష్ ఇటీవలే పవన్ కళ్యాణ్ కి వివరించాడట..డిసెంబర్ లోపు సినిమా పూర్తి అయితే ‘భవదీయుడు భగత్ సింగ్’ మీద ఫుల్ ఫోకస్ పెడుదాం అనుకున్నాడు పవన్ కళ్యాణ్..కానీ అది సాధ్యపడే సూచలను కనిపించకపోవడం..మార్చి నుండి ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర ప్రారంభం అవుతుండడం వల్ల 2024 ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఈ సినిమా చేయలేనని పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కి మరియు మైత్రి మూవీ మేకర్స్ కి చెప్పేశాడట.

‘నాకు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంబిద్దామా అని ఉంది..కానీ పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఇప్పట్లో చేసే పరిస్థితి కనిపించడం లేదు..దయచేసి నన్ను క్షమించండి’ అంటూ పవన్ కళ్యాణ్ మైత్రి మూవీ మేకర్స్ తో చెప్పాడట..దీనితో హరీష్ శంకర్ విజయ్ దేవరకొండ తో సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు..మరి పవన్ ఫాన్స్ ‘భవదీయుడు’ కోసం 2024 వరుకు ఎదురు చూడక తప్పదు.