MM Keeravani: ఎం.ఎం. కీరవాణి అందించిన అద్భుతమైన పాటలు..

బాహుబలి చిత్రంలోని శివుని ఆనా అనే పాట కూడా కీరవాణి నుంచి వచ్చిన పాటనే. ఆర్ఆర్ఆర్ సినిమా తో తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించిన దర్శకుడు రాజమౌళి. అయితే బాహుబలి సినిమాను కూడా రాజమౌళి నిర్మించారు. బాహుబలి పార్ట్ 1 లోని శివుని పాట దేశ వ్యాప్తంగా హిట్ అయ్యింది.

Written By: Swathi, Updated On : March 21, 2024 6:52 pm

MM Keeravani

Follow us on

MM Keeravani: ఆయన పాట వింటే మనుసుకు హాయి.. హాయి గొలిపే సెగలు, నాట్యం చేస్తున్నట్టగా తగిలే గాలి, పరవసించి పోయే మనుసు ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గంలో తేలుతున్నట్టుగా అనుభూతి చెందాల్సిందే ఆయన పాటలు వింటే. ఆయన ఎవరు అనుకుంటున్నారా ఎం.ఎం కీరవాణి. పంచదార బొమ్మ బొమ్మ, నల్లా నల్లాని కల్లా పిల్లా, ధీరా ధీర ధీర అంటూ పాటలు మనం విన్నాం అంటే అవి ఆయన స్వరపరిచినవే. ఎన్నో పాత పాటల నుంచి నేడు నాటునాటు పాట కూడా ఆయన పాటనే. అయితే నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోమ్ అవార్డు అందుకున్నారు. ఇలా వచ్చిన ఎన్నో అద్భుతాలలో కొన్ని మీకోసం…

1.శివుని ఆనా
బాహుబలి చిత్రంలోని శివుని ఆనా అనే పాట కూడా కీరవాణి నుంచి వచ్చిన పాటనే. ఆర్ఆర్ఆర్ సినిమా తో తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించిన దర్శకుడు రాజమౌళి. అయితే బాహుబలి సినిమాను కూడా రాజమౌళి నిర్మించారు. బాహుబలి పార్ట్ 1 లోని శివుని పాట దేశ వ్యాప్తంగా హిట్ అయ్యింది.

2..సాహోరే బాహుబలి:
సాహోరే బాహుబలి అంటూ వచ్చినా పాట సినిమాకే ఒక అద్భుతం. బాహుబలి కన్ క్లజన్ లో వస్తుంది ఈ పాట. ఈ పాట దేశవ్యప్తంగా గుర్తింపు పొందింది. బాహుబలి అభిమానులు ఇప్పటికి ఈ పాటను వింటూనే ఉంటారు.

3..నీతో ఉంటే చాలు
బింబిసారలో ఉన్న నీతో ఉంటే చాలు పాట ఎంతో మందికి నచ్చింది. నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ఫాంటసీ యాక్షన్ చిత్రం లో నీతో ఉంటే పాటు అనే పాటను సమకూర్చారు ఎం.ఎం. కీరవాణి. ఈ పాట సంగీత ప్రియులను ఎంతో అలరిస్తోంది.

4..టూ మైల్ -క్రిమినల్(1995)
సంగీత దర్శకుడు కీరవాణి 90 దశకంలో పలు అద్భత పాటలను రూపొందించారు. వాటిలో బాగా పాపులర్ అయిన సాంగ్ టు మైల్. నాగార్జున రమ్య కృష్ణ, మనీషా కోయిరాలా నటించిన మహేష్ భట్ సినిమా క్రిమినల్ లోని ఈ పాటను కుమార్ సాను, చిత్ర అల్కా యాగ్నిక్ పాడారు.

5..గలీ మే ఆజ్ చాంద్ నిక్లా-జఖ్మ్ (1998)
మహేష్ భట్ దర్శకత్వంలో ఆయన కుమార్తె పూజా భట్ నటించిన సినిమా జఖ్మ. ఈ సినిమా ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. ఇందులోని గలీ మే ఆజ్ చాంద్ నిక్లా అనే పాట ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఆల్కా యాగ్నిక్ పాడిన ఈ పాటను పాడి మంచి సక్సెస్ ను అందుకుంది.