Raj Tarun: రాజ్ తరుణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు..?ఆయనకి ఇక హీరో గా అవకాశాలు రావా..?

Raj Tarun: ఎట్టకేలకు ఏ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో 'తిరగబడరా సామి' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అతని కెరియర్ లో మరోసారి హీరోగా నటించి మెప్పించబోతున్నాడు అని అనుకుంటున్నా సమయంలో...

Written By: Gopi, Updated On : July 6, 2024 10:23 am

Will Raj Tarun get any more chances as a hero

Follow us on

Raj Tarun: యంగ్ హీరో గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ మొదట్లోనే వరుసగా మూడు సక్సెస్ లను అందుకొని టాప్ హీరోగా ఎదిగాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆయన ఇమేజ్ అనేది భారీగా డ్యామేజ్ అయింది. ఇక మధ్యలో కొన్ని వివాదాల వల్ల కూడా ఆయన వార్తల్లో నిలిచాడు. దానివల్ల ఆయనతో సినిమాలు చేయడానికి ఏ దర్శక నిర్మాతలు కూడా ముందుకు రాలేకపోయారు.

ఇక ఎట్టకేలకు ఏ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ‘తిరగబడరా సామి’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అతని కెరియర్ లో మరోసారి హీరోగా నటించి మెప్పించబోతున్నాడు అని అనుకుంటున్నా సమయంలో రీసెంట్ గా లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని నార్సింగ్ పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.

ఇక దాంతో రాజ్ తరుణ్ మరోసారి తన ఇమేజ్ ను పోగొట్టుకుంటున్నాడనే చెప్పాలి. ఇక దానికి తోడుగా ప్రస్తుతం ఆయన చేస్తున్న తిరగబడరా సామి సినిమా హీరోయిన్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడనే వార్తలు కూడా బయటికి రావడం పెద్ద దుమారాన్ని రేపుతుంది. మరి ఇప్పటికైన ఆయనకు మంచి మార్కెట్ ఏర్పడి మరోసారి హీరోగా మనం ఆయన్ని చూడబోతున్నాం అని అతని అభిమానులు అనుకుంటున్న సమయం లో ఈయన చేసిన ఈ పనుల వల్ల చాలావరకు తనకు తెలియకుండానే చాలా నష్టపోతున్నాడు.

ఇక నాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రాజ్ తరుణ్ ఇకమీదట కూడా అలాంటి పాత్రలే చేస్తారని అందరు అనుకున్నారు. కానీ అందరికీ షాకిస్తు తను హీరోగా చేయడం ఒకంతుకు మంచి విషయమే అయినప్పటికీ, దానిని నిలబెట్టుకునే ప్రయత్నం మాత్రం చేయలేకపోతున్నాడు. చూడాలి మరి ఇక మీదట రాజ్ తరుణ్ సినిమా హీరోగా చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది…