Pawan Kalyan: ద్వారంపూడి కి గట్టి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

గతంలో పవన్ వారాహి యాత్ర చేపట్టినప్పుడు ద్వారంపూడిని టార్గెట్ చేసుకున్నారు. అంతకంటే ముందే జనసైనికులను వెంటాడారు ద్వారంపూడి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ ద్వారంపూడిని ఉక్కు పాదంతో తొక్కి పెడతానని హెచ్చరించారు.

Written By: Dharma, Updated On : July 6, 2024 10:21 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: వైసిపి సీనియర్ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. వ్యాపారం మూలాలపై వరుస దెబ్బలు పడుతున్నాయి. ఆయనకు బ్యాడ్ డేస్ మొదలైనట్లేనని తెలుస్తోంది. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన ఫోకస్ పెట్టింది. కాకినాడలో బియ్యం మాఫియా చెలరేగుతోందని, ద్వారంపూడి పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని, కాకినాడలో కబ్జాలు చేసి ద్వారంపూడి రౌడీ రాజ్యాన్ని స్థాపించాడని ఆయనపై ప్రత్యేకంగా టార్గెట్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.

గతంలో పవన్ వారాహి యాత్ర చేపట్టినప్పుడు ద్వారంపూడిని టార్గెట్ చేసుకున్నారు. అంతకంటే ముందే జనసైనికులను వెంటాడారు ద్వారంపూడి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ ద్వారంపూడిని ఉక్కు పాదంతో తొక్కి పెడతానని హెచ్చరించారు. అయితే తనపై పోటీ చేసి గెలవాలని ద్వారంపూడి సవాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో పవన్ కాకినాడ నుంచి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీపవన్ మాత్రం పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఆ ప్రభావం తూర్పుగోదావరి జిల్లా మొత్తం పై పడింది. ద్వారంపూడి సైతం దారుణంగా ఓడిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ గా మారారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ద్వారంపూడిపై పడ్డారు అధికారులు. ఆయన చేపట్టిన అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేశారు. ప్రతిఘటించడంతో ద్వారంపూడిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. గత ఐదు సంవత్సరాలుగా ద్వారంపూడి చేసిన దురాగతాలపై కూటమి నేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తాజాగా పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్ సంస్థకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. గత కొంతకాలంగా ఆ సంస్థకు చెందిన శుద్ధి చేయని వ్యర్థాలను బయటకు విడిచి పెడుతున్నారు. పంట కాలువల ద్వారా వ్యర్ధాలు వస్తుండడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పర్యావరణ ఉల్లంఘన కూడా జరుగుతోంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని పవన్ ఆదేశించారు. 15 రోజుల్లోగా సంస్థకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.