https://oktelugu.com/

MS Narayana : కమెడియన్ MS నారాయణ కొడుకు గుర్తున్నాడా..? ఇప్పుడు అతను ఎక్కడున్నాడో..ఏమి చేస్తున్నాడో తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజండరీ కమెడియన్స్ లిస్ట్ తీస్తే అందులో ఏం ఎస్ నారాయణ పేరు కచ్చితంగా మొదటి రెండు స్థానాల్లో ఉంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : December 21, 2024 / 02:22 PM IST

    MS Narayana

    Follow us on

    MS Narayana : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజండరీ కమెడియన్స్ లిస్ట్ తీస్తే అందులో ఏం ఎస్ నారాయణ పేరు కచ్చితంగా మొదటి రెండు స్థానాల్లో ఉంటుంది. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో, బ్రహ్మానందంతో సమానంగా కామెడీ ని పండించే ఏకైక కమెడియన్ ఆయన. లెక్చరర్ గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత నాటకాలకు స్క్రిప్ట్స్ ని అందిస్తూ, అలా సినీ రంగంలోకి రచయితగా అడుగుపెట్టి, 1994 వ సంవత్సరం లో మోహన్ బాబు హీరో గా నటించిన ‘ఏం ధర్మరాజు MA’ చిత్రం తో తొలిసారి నటుడిగా వెండితెర మీద కనిపించాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం తో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా సినిమా అవకాశాలు ఆయన ఇంటి తలుపు తట్టాయి. ఈయన్ని రోజుల్లో నటుడిగా మోహన్ బాబు ఎక్కువగా ప్రోత్సహించాడు.

    ‘ఏం ధర్మరాజు MA’ తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన ‘పుణ్య భూమి నాదేశం’, ‘పెద్దరాయుడు’ వంటి చిత్రాల్లో కూడా ఏం ఎస్ నారాయణకు మంచి పాత్రలు దక్కాయి. అలా మొదలైన ఏం ఎస్ నారాయణ సినీ ప్రయాణం, కమెడియన్ గా ఆయన్ని అతి తక్కువ సమయంలోనే స్టార్ ని చేసింది. 1998 వ సంవత్సరం లో ఆయన ఏకంగా 13 సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. ఇండస్ట్రీ లోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఆయన ఎదుగుదల ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అదే విధంగా 1999 వ సంవత్సరం లో ఏకంగా 23 చిత్రాల్లో కమెడియన్ గా నటించాడు. బ్రహ్మానందం కి కూడా ఈ స్థాయి డిమాండ్ ఉండేది కాదు అప్పట్లో. MS నారాయణ తాగుబోతు క్యారెక్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచేవాడు ఆరోజుల్లో. దర్శక నిర్మాతలు కూడా ఆయనకీ ఎక్కువగా అలాంటి క్యారెక్టర్స్ నే రాసేవారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ కూడా చాలా కామెడీ గా అనిపించేది.

    అయితే కెరీర్ పీక్ స్థాయిలో కొనసాగుతున్న రోజుల్లోనే అనారోగ్యం కారణంగా 2015 వ సంవత్సరం లో ఆయన కన్నుమూశాడు. ఆయన చనిపోయిన తర్వాత కొడుకు విక్రమ్ నారాయణ పడిన కష్టాలు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొని ఎంతో బాధపడ్డాడు. విక్రమ్ కూడా పలు సినిమాల్లో నటించాడు. ఆయన హీరోగా అప్పట్లో ‘కొడుకు’ అనే చిత్రం వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే MS నారాయణ చనిపోయే ముందు 30 సినిమాలు చేసాడు. ఈ చిత్రాలు ఆయన చనిపోయిన తర్వాత విడుదల అయ్యాయి. కానీ ఆయన చనిపోయాక ఈ సినిమాలకు సంబంధించిన రెమ్యూనరేషన్స్ కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడట. స్టూడియోల చుట్టూ తిరిగి ఆయన తండ్రిగారికి రావాల్సిన రెమ్యూనరేషన్స్ ని దక్కించుకున్నాడట. తన తండ్రి కష్టం వృధా పోకూడదు అనే ఉద్దేశ్యంతోనే నేను ఆయనకీ రావాల్సిన రెమ్యూనరేషన్స్ కోసం అంతలా పోరాడాను అని, ఎట్టకేలకు 60 శాతం వరకు మా నాన్నగారికి రావాల్సిన రెమ్యూనరేషన్స్ ని తిరిగి రప్పించుకున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నా విక్రమ్ అడ్వకేట్ గా కెరీర్ ని నెట్టుకొస్తున్నాడు. సినిమాల్లో నటించడానికి సిద్దంగానే ఉన్నప్పటికి అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేరని విక్రమ్ బాధపడ్డాడు. MS నారాయణ లాంటి లెజెండ్ కడుపున పుట్టి, ఇలా అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రావడాన్ని చూసి, ఏం ఎస్ నారాయణ అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.