ఊహించని ఉపద్రవం కరోనా అనేక దారుణాలకు కారణం అయ్యింది. మనిషిని మనిషికి దూరం చేసిన మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. అనేక పరిశ్రమలు కరోనా కారణంగా కుదేలయ్యాయి. వాటిలో సినిమా పరిశ్రమ ప్రధానమైంది. దశాబ్దాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న చిత్ర పరిశ్రమ మూతపడింది. షూటింగ్స్ నిలిచిపోవడంతో పాటు, థియేటర్స్ బంద్ కారణంగా కొత్త చిత్రాల విడుదల నిలిచిపోయింది. దీనితో సినీ కార్మికులు, చిన్న చిన్న నటులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పరిశ్రమ ప్రముఖులు కొంతమేర వారిని ఆదుకొనే ప్రయత్నం చేసినా… పూర్తి స్థాయిలో వారి కష్టాలైతే తీరలేదు. దీనితో ఆత్మహత్యలు, ఆకలి చావులు సంభవించాయి.
Also Read: ఆర్ఆర్ఆర్ కోసం రిస్కీ స్టంట్ చేసిన రాజమౌళి
ఒక్క టాలీవుడ్ నుండే ఏటా 160 నుండి 180 చిన్నా, పెద్ద చిత్రాలు విడుదల అయ్యేవి. అలాంటిది ఈ ఏడాది పట్టుమని పది చిత్రాలు కూడా థియేటర్స్ లో విడుదల కాలేదు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సంక్రాంతి చిత్రాలుగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేశాయి. శుభారంభం లభించిందని ఆనందించిన నిర్మాతలకు కరోనా షాక్ ఇచ్చింది. పూర్తయిన సినిమాల విడుదల నిలిచిపోవడం నిర్మాతలపై పెను భారం మోపింది. వడ్డీల భారం పెరిగిపోవడంతో, నిర్మాణం వ్యయం పెరిగి ఓటిటి బాట పట్టాల్సివచ్చింది. సమీప కాలంలో థియేటర్స్ ఓపెన్ చేసే మార్గం కనిపించకపోవడంతో, వచ్చిన ధరకు ఓటిటి సంస్థలకు సినిమాలు అమ్ముకొని ఎంతో కొంత నష్టాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చేశారు. దిల్ రాజు లాంటి బడా నిర్మాత మీడియం బడ్జెట్ మూవీ ‘వి’ అమెజాన్ లో విడుదల చేశారంటే… ఇక చిన్న నిర్మాతల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Also Read: అనూహ్యంగా ఓటింగ్ లో అభిజిత్ రెండో స్థానానికి!
ఇక 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ రన్ చేసుకొనే వెసులుబాటు ప్రభుత్వాలు కల్పించినా.. థియేటర్స్ యాజమాన్యాలు సిద్ధంగా లేవు. పూర్తి స్థాయి సీటింగ్ కెపాసిటీతో నపడుపుతుంటేనే థియేటర్స్ ఓనర్స్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండగా, 50శాతం సీట్లతో బొమ్మవేస్తే ఖర్చులు కూడా రావని భావిస్తున్నారు. దీనితో కనీసం డిసెంబర్ లో అయినా పూర్తి స్థాయిలో థియేటర్స్ తెరుచుకుంటాయని భావించిన సినీ ప్రేక్షకులకు, నిరాశే ఎదురైయ్యేలా కనిపిస్తుంది. జనవరిలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యే సూచనలు కలవనే వార్తల నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్స్ వైపు అడుగులు వేస్తారని కచ్చితంగా చెప్పలేము.సినిమా పండుగగా భావించే సంక్రాంతికి వెండితెరపై బొమ్మ పడుతుందా అనే అనుమానం కలుగుతుంది. కాబట్టి అప్పుడే థియేటర్స్ కి పూర్వ వైభవం రాకపోవచ్చు. ఐతే కరోనా వాక్సిన్ అందుబాటులోకి రాగా… ఆ తరువాత ఎప్పటిలా థియేటర్స్ ప్రేక్షకులతో సందడిగా మారే అవకాశం కలదు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్