https://oktelugu.com/

‘మేజర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు.. ఎలా ఉందంటే?

టాలీవుడ్ లో విలక్షణ విభిన్న కథాంశంతో సినిమాలు తీసే హీరో అడవి శేష్. ఇప్పటికే పలు చిత్రాలతో హిట్స్ కొట్టాడు. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా ‘మేజర్’ మూవీ తెరకెక్కుతోంది. గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తుండడం విశేషం. Also Read: వెండితెర పై సంక్రాంతి సందడి ఉంటుందా? సోనీ పిక్చర్స్, మహేష్ జీఎంబీ, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2020 / 01:46 PM IST
    Follow us on

    టాలీవుడ్ లో విలక్షణ విభిన్న కథాంశంతో సినిమాలు తీసే హీరో అడవి శేష్. ఇప్పటికే పలు చిత్రాలతో హిట్స్ కొట్టాడు. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా ‘మేజర్’ మూవీ తెరకెక్కుతోంది. గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తుండడం విశేషం.

    Also Read: వెండితెర పై సంక్రాంతి సందడి ఉంటుందా?

    సోనీ పిక్చర్స్, మహేష్ జీఎంబీ, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశాడు.

    అడవి శేష్ పుట్టినరోజు ఈరోజు సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేశారు. ఈ లుక్ ను విడుదల చేసిన మహేష్ బాబు ప్రత్యేకంగా అడవి శేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

    Also Read: ఆర్ఆర్ఆర్ కోసం రిస్కీ స్టంట్ చేసిన రాజమౌళి

    మహేష్ విషెస్ నందుకున్న అడవి శేష్ ‘థాంక్యూ సూపర్ స్టార్.. మీ అంచనాలు అందుకునేలా వచ్చే వేసవిలో ఈ చిత్రంతో రంగంలోకి దిగుతాం.. ప్రోత్సహించిన నమ్రతకు కృతజ్ఞతలు’ అని మహేష్ కు బదులిచ్చాడు.

    ముంబైలో 26/11 తీవ్రవాద దాడుల్లో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈసినిమా రూపొందుతోంది. శోభిత, సైయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    https://twitter.com/AdiviSesh/status/1339449403208155137?s=20