https://oktelugu.com/

Prema Entha Madhuram Serial: జలంధర్ ప్లాన్‌ను తెలుసుకున్న ఆర్య.. కథ మలుపు తిరగనుందా?

Prema Entha Madhuram Serial: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రేటింగ్ కూడా మొదటి స్థానంలోనే నిలుస్తుంది. ఇక ప్రస్తుతం కథ మొత్తం ఆర్య, అను ల పెళ్లి గురించే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఆర్యకు జలంధర్ ఫోన్ చేసి రాజనందిని గురించి పెళ్లి మండపంలో ప్రశ్నలు ఎదురవుతాయి అంటూ మాట్లాడేసరికి అక్కడే ఉన్న జెండే అతడిపై ఫైర్ అవుతాడు. మరోవైపు అను తన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 13, 2021 / 11:43 AM IST
    Follow us on

    Prema Entha Madhuram Serial: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రేటింగ్ కూడా మొదటి స్థానంలోనే నిలుస్తుంది. ఇక ప్రస్తుతం కథ మొత్తం ఆర్య, అను ల పెళ్లి గురించే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఆర్యకు జలంధర్ ఫోన్ చేసి రాజనందిని గురించి పెళ్లి మండపంలో ప్రశ్నలు ఎదురవుతాయి అంటూ మాట్లాడేసరికి అక్కడే ఉన్న జెండే అతడిపై ఫైర్ అవుతాడు. మరోవైపు అను తన పెళ్లి కోసం బట్టలను, నగలను సిద్ధంగా ఉంచుకుంటుంది. తన తండ్రి సుబ్బు మాత్రం అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అను తల్లి వచ్చి సుబ్బు తో అనుకు అన్నం తినిపించమని అనడంతో వెంటనే నేనా అని ఆశ్చర్యపోతూ కొన్ని మాటలు మాట్లాడుతాడు.

    అనుకు చిన్నప్పుడు తినిపించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. అను వచ్చి తినిపించండి నాన్న అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఇక మధ్యలో అను తల్లి గారాభంగా మాట్లాడటంతో అను, సుబ్బు నవ్వుతారు. ఇక అనుకి అన్నం తినిపిస్తున్న సమయంలో కాస్త ఎమోషనల్ గా కనిపిస్తుంది. మరోవైపు ఆర్య, జిండే.. కిడ్నాప్ చేసిన అశ్విన్ దగ్గరికి వెళ్లగా జిండే అతని కట్లు విప్పుతాడు. ఇక ఆర్య మాట్లాడుతూ తప్పు చేసిన వాడు అసలు పేరుతో రాడు అని అసలు పేరు అడగగా గుణ అని తన అసలు పేరు చెబుతాడు. ఇక పక్కనున్న జిండే గుణ పై మరింత కోపం ప్రదర్శిస్తాడు.

    పెళ్లి మండపంలో జలంధర్ చేసిన ప్లాన్ గురించి చెబుతావా లేదా నా స్టైల్ లో చెప్పమంటావా అంటూ జిండే ప్రశ్నించేసరికి అసలు నిజం చెబుతాడు గుణ. పెళ్లి కార్డులో.. ఆర్య పై వచ్చిన న్యూస్ పేపర్ లోని వార్తలు కట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్లాన్ చేశాడని తెలిపాడు. దీంతో ఆర్య షాక్ అవుతూ తమ దగ్గర ఉన్న పెళ్లి కార్డు బాక్సును చెక్ చేయమని జిండే తో చెబుతాడు. ఇక జిండే అందులో ఎక్కడా లేవని అనడంతో ఆర్య షాక్ అవుతాడు. వెంటనే గుణ ఇందులో నా తప్పు లేదంటూ జలంధర్ చెప్పినట్లు చేశానని అంటాడు. వెంటనే ఆర్య జలంధర్ కు ఫోన్ చేయమని స్పీకర్ ఆన్ చేయమని అంటాడు.

    జలంధర్ ఎక్కడికి వెళ్ళిపోయావు గుణ అనేసరికి ఆర్య మాట్లాడి షాక్ ఇవ్వడంతో గుణ దొరికిపోయాడా అంటూ పొగరుగా మాట్లాడుతాడు జలంధర్. పెళ్లి కార్డ్స్ ఎక్కడ పెట్టావ్ అని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా మాట్లాడుతూ చివరికి గుణ ని కూడా చంపేసిన పర్వాలేదు అని ఫోన్ కట్ చేస్తాడు. ఇక జిండే గుణపై కోపంతో రగిలిపోగా ఆర్య గుణ ను వదిలేస్తాడు. మరోవైపు అను తన ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సమయంలో ఆర్య కూడా వచ్చి తన చెయ్యి పట్టుకుని ముగ్గు వేసినట్లుగా ఫీల్ అవుతుంది. కానీ తర్వాత చూసేవరికి ఆర్య ఉండడు. ఇక సంపత్ తండ్రి వచ్చి వాకిట్లో ముగ్గు వేసినట్టుగా కోటీశ్వరుని కూడా ముగ్గులో వేసింది కదా అంటూ విమర్శిస్తాడు. దీంతో అను బాధపడినట్లు కనిపిస్తుంది.