NTR: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. కెరియర్ స్టార్టింగ్ లోనే ఆయన ఆది, సింహాద్రి లాంటి మాస్ సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకొని తెలుగు ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయనకు వరుసగా ఫ్లాప్ సినిమాలు కూడా రావడం మొదలయ్యాయి. కానీ ఆ ప్లాపుల నుంచి తేరుకొని తొందరగానే మంచి సక్సెస్ లను అందుకొని ముందుకు సాగుతూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ పూరి జగన్నాధ్ తో చేసిన ‘టెంపర్ ‘ సినిమాకి ముందు దాదాపు ఒక ఐదు సంవత్సరాల పాటు ఎన్టీఆర్ కి సరైన సక్సెస్ అయితే లేదు. దానివల్ల ఆయన చాలా వరకు డీలా పడిపోయినట్టుగా కూడా వార్తలైతే వచ్చాయి.
ఇక ఎన్టీఆర్ పని కూడా అయిపోయింది అంటూ చాలామంది విమర్శించారు. అయినప్పటికీ పూరి జగన్నాధ్ చేసిన టెంపర్ సినిమాతో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయి సక్సెస్ ని అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో అప్పటి నుంచి ఆచితూచి సినిమాలు చేయాలని ఉద్దేశ్యంతో ఎన్టీయార్ మంచి కథలను ఎంచుకొని సినిమాలుగా చేస్తున్నాడు. ఇక అందులో భాగంగా వచ్చిన సినిమాలే నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ ,అరవింద సమేత, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు కావడం విశేషం…
ఇక ఇప్పటికే ఆయన వరుసగా ఆరు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకొని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏడో సక్సెస్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక టెంపర్ ముందు వరకు ఎన్టీఆర్ వేరు టెంపర్ నుంచి ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలు వేరు అనేంతలా ఒక గొప్ప మార్పు అనేది తీసుకొచ్చాడు. నిజానికి ఆయన అంతకుముందు మొహమాటానికి పోయి కొన్ని కథలను ఒప్పుకొని సినిమాలుగా చేసి ఫెయిల్యూర్స్ ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాత నుంచి మాత్రం ఏ దర్శకుడు కథ చెప్పిన కూడా మొహమాటం అనేది లేకుండా తనకు కథ నచ్చితేనే సినిమా చేస్తున్నాడు.
లేకపోతే మాత్రం రిజెక్ట్ చేస్తూ మంచి కథ తీసుకొస్తే మళ్లీ మనం సినిమా చేద్దామని దర్శకులకు చెబుతున్నాడు. అందువల్లే తన సక్సెస్ రేట్ అనేది పెరుగుతూ వచ్చింది. నిజానికి ఎన్టీఆర్ కనక అలాంటి డిసిజన్ తీసుకోకపోతే ఇప్పుడూ ఆయన ఈ రేంజ్ లో ఉండేవాడు కాదు అనేది మాత్రం వాస్తవం…ఇక ప్రస్తుతం దేవర సినిమాతో వస్తున్న ఆయన మరోసారి భారీ సక్సెస్ మీద కన్నేసినట్టుగా తెలుస్తోంది…