Pushpa 2 Pre Release Event: పుష్ప 2 విడుదలకు గంటల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 5న ఈ చిత్రం వస్తున్నప్పటికీ.. 4వ తేదీ అర్ధరాత్రి నుండే తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శనలు జరగనున్నాయి. యూఎస్ లో ప్రీమియర్స్ కూడా మొదలవుతాయి. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో పుష్ప 2 చివరి ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. పుష్ప 2 చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ. .. పుష్ప 2 అందనంత ఎత్తులో ఉంది. నా మ్యూజిక్ టీం కి పేరు పేరున ధన్యవాదాలు. డే అండ్ నైట్ నాతో కష్టపడి పని చేశారు. వీరందరి కష్టంతోనే పుష్ప పార్ట్ వన్ సాంగ్స్ బాగా వచ్చాయి. నేషనల్ అవార్డు నేను గెలుచుకోవడానికి కూడా కారణం అయ్యారు.
దర్శకుడు సుక్కు కి ధన్యవాదాలు.. ఈ చిత్రంతో మమ్మల్ని నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కి తీసుకెళ్లారు. ఆయన పబ్లిసిటీ కోరుకోరు. ఇక పుష్ప 2 నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్. వారు వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నా… నాకు ఫోన్ చేసి చెబుతారు. అల్లు అరవింద్ గారు మైత్రీ కి బ్రాండ్ వేశారు. అలాగే సాంగ్స్ హిట్ కావడానికి చంద్రబోస్ కారణం. ఫేస్ ఆఫ్ ది సాంగ్ చంద్రబోస్ గారు. ఇతర భాషల్లో రాసిన రచయితలకు కూడా నా ధన్యవాదాలు.
రష్మిక వేరే హీరోలతో చేస్తుంటే నాకు కోపం వస్తుంది. పుష్ప ప్రాజెక్ట్స్ లో అల్లు అర్జున్- రష్మిక బెస్ట్ కపుల్. సూసేకి పాట బాగా వచ్చింది. కిస్సిక్ అంటూ ఝలక్ ఇచ్చిన శ్రీలీలకు ధన్యవాదాలు. ఈ పాట ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఫీలింగ్స్ సాంగ్ లో రష్మిక, అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ అంటే ఏమిటో చూపించారు. నా ఫ్రెండ్ అల్లు అర్జున్ గురించి చెప్పాలి. నేను మీ గురించి మాట్లాడేటప్పుడు అల్లు అరవింద్ వైపు చూస్తాను. ఆయన్ని నేను మా నాన్న యాంగిల్ లో చూస్తాను.
పుష్ప 2 మూవీ చూశాక అల్లు అరవింద్ నాకు ఫోన్ చేశారు. ఆయన ఫీలింగ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. డిసెంబర్ 5న కలుద్దాం… అని ముగించారు. కాగా చెన్నై ఈవెంట్లో దేవిశ్రీ నిర్మాతలపై అసహనం బయటపెట్టిన సంగతి తెలిసిందే..